IPL Delhi vs Kolkata : ఢిల్లీ గెలిచిందోచ్!
ABN , First Publish Date - 2023-04-21T02:56:04+05:30 IST
ఈ సీజన్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. కానీ 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేరుకొనేందుకు శ్రమించాల్సి వచ్చింది. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో కోల్‌కతా తొలుత 130 పరుగులలోపే

బౌలర్లు భళా, వార్నర్ హాఫ్ సెంచరీ
4 వికెట్లతో కోల్‌కతాపై గెలుపు
ఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. కానీ 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేరుకొనేందుకు శ్రమించాల్సి వచ్చింది. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో కోల్‌కతా తొలుత 130 పరుగులలోపే ఆలౌటైంది. ఛేదనలో ఢిల్లీ కెప్టెన్ వార్నర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టినా కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి చకచకా వికెట్లు చేజార్చుకుంది. అయితే లక్ష్యం మరీ భారీగా లేకపోవడంతో క్యాపిటల్స్ గట్టెక్కగలిగింది. వర్షంవల్ల గురువారం నాటి ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మొదట కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జేసన్ రాయ్ (39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్. రస్సెల్ (31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రెండు సీజన్ల తర్వాత తొలి మ్యాచ్ ఆడిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాంత్ శర్మ రెండు వికెట్లతో తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. నోకియా, అక్షర్, కుల్దీప్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 19.2 ఓవర్లలో 128/6 స్కోరు చేసి నెగ్గిం ది. వార్నర్ (41 బంతుల్లో 11 ఫోర్లతో 57), మనీశ్ పాండే (21), అక్షర్ (19 నాటౌట్) రాణించారు. మొత్తంగా ఐదు వరుస ఓటములకు చెక్ పెడుతూ సొంత మైదానంలో విజయం అందుకున్న ఢిల్లీ పాయింట్ల ఖాతా తెరిచింది.
ఆదుకున్న వార్నర్, మనీశ్ : ఛేదనను ఢిల్లీ దూకుడుగా మొదలు పెట్టింది. కానీ నైట్‌రైడర్స్ స్పిన్నర్లు కూడా సత్తా చాటడంతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ వార్నర్, మనీశ్ పాండే, అక్షర్ సంయమనంతో ఆడడంతో విజయానికి ఢోకా లేకపోయింది. కెజ్రోలియా వేసిన రెండో ఓవర్లో పృథ్వీ షా ఒకటి, వార్నర్ రెండు ఫోర్లు సంధించారు. రస్సెల్ ఓవర్లో ఢిల్లీ కెప్టెన్ మరో రెండు ఫోర్లు దంచడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఇక పృథ్వీ (13) చెత్త ఫామ్‌ను కొనసాగిస్తూ వరుణ్ బంతిని వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డయ్యాడు. నరైన్ ఓవర్లో నాలుగు ఫోర్లతో వార్నర్ దుమ్ము రేపడంతో పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 61/1తో విజయం దిశగా దూసుకుపోయింది. మిచెల్ మార్ష్ (2) కూడా పేలవ ఫామ్‌ను కొనసాగించగా సాల్ట్ (5)ను ఇంపాక్ట్ బౌలర్ అనుకూల్ రాయ్ తన బౌలింగ్‌లోనే క్యాచవుట్ చేశాడు. అనుకూల్ బౌలింగ్‌లో బౌండరీతో హాఫ్ సెంచరీ పూరించిన వార్నర్‌ను వరుణ్ ఎల్బీగా తిప్పిపంపాడు. వార్నర్ రివ్యూ కోరినా ఉపయోగం లేకపోయింది. ఈ దశలో ఢిల్లీ ఇబ్బందుల్లో పడినట్టు కనిపించినా..నరైన్ బౌలింగ్‌లో మనీశ్, అక్షర్ చెరో ఫోర్ కొట్టి ఒత్తిడి తగ్గించారు. కానీ అనుకూల్, రాణా విజృంభించి మనీశ్, అమన్‌ను అవుట్ చేసి కోల్‌కతాను రేస్‌లోకి తెచ్చారు. 19వ ఓవర్లో అక్షర్‌ను లిటన్ స్టంపింగ్ చేసి ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరమయ్యేది. ఇక ఢిల్లీ విజయానికి ఆరు బంతుల్లో ఏడు పరుగులు కావాల్సి రావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగిపోయింది. కానీ అక్షర్ వరుసగా రెండేసి పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. లలిత్ యాదవ్ (4 నాటౌట్) అతడికి అండగా నిలిచాడు.
వణికించిన బౌలర్లు: ఢిల్లీ బౌలర్ల ధాటికి కోల్‌కతా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. వర్షంవల్ల పిచ్‌పై ఏర్పడిన తేమతోపాటు అదనపు బౌన్స్‌ను సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ బౌలర్లు ప్రత్యర్థిని దెబ్బ తీశారు. తొలి మ్యాచ్ ఆడుతున్న జేసన్ రాయ్, చివర్లో రస్సెల్ ఆదుకోబట్టికానీ..లేదంటే నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ మరీ ఘోరంగా ముగిసేది. ఇద్దరు కొత్త ఓపెనర్లు జేసన్ రాయ్, లిటన్ దాస్‌తో కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభించగా..రెండు సీజన్ల తర్వాత ఐపీఎల్ బరిలో దిగిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఢిల్లీ బౌలింగ్ దాడిని మొదలు పెట్టాడు. నిలకడగా 140 కి.మీ. వేగంతో బంతులు వేసి బ్యాటర్లను వణికించాడు. తొలి ఓవర్లో లిటన్ బౌండరీ, ముకేశ్ వేసిన రెండో ఓవర్లో రాయ్ రెండు ఫోర్లు దంచారు. కానీ తన మొదటి ఓవర్ చివరి బంతికి లిటన్ (4)ను అవుట్ చేసిన ముకేశ్ ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. ఇక ముంబైతో గత మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ము రేపిన వెంకటేశ్ అయ్యర్ (0)ను పెవిలియన్ చేర్చడంద్వారా నోకియా నైట్‌రైడర్స్‌ను దెబ్బ కొట్టాడు. కెప్టెన్ నితీశ్ రాణా (4) కూడా ఇషాంత్ ధాటికి ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దాంతో పవర్ ప్లేలో రైడర్స్ 35/3తో నిలిచింది. అక్షర్ బంతిని రివర్స్ స్కూప్ ఆడబోయి మన్‌దీప్ (12) క్లీన్‌బౌల్డ్ కాగా..తన తదుపరి ఓవర్లో పవర్ హిట్టర్ రింకూసింగ్ (6)ను క్యాచవుట్ చేసిన అక్షర్ ప్రత్యర్థికి కోలుకోలేని షాకిచ్చాడు. రెండో స్పెల్‌కు వచ్చిన ఇషాంత్ షార్ట్‌పిచ్ బంతితో నరైన్‌ను అవుట్ చేసి ఢిల్లీలో జోష్ నింపాడు. 15వ ఓవర్లో వరుస బంతుల్లో జేసన్, ‘ఇంపాక్ట్’ అనుకూల్ రాయ్ (0)ల వికెట్లను కుల్దీప్ తీశాడు. ఉమేశ్ (3)ను నోకియా అవుట్ చేయగా..ఆఖరి ఓవర్లో రస్సెల్ మూడు సిక్సర్లతో చెలరేగినా..చివరి బంతికి వరుణ్ (1) రనౌటయ్యాడు.
స్కోరు బోర్డు
కోల్‌కతా: జేసన్ రాయ్ (సి) అమన్ (బి) కుల్దీప్ 43, లిటన్ దాస్ (సి) లలిత్ (బి) ముకేష్ 4, వెంకటేష్ (సి) మార్ష్ (బి) నోకియా 0, రాణా (సి) ముకేష్ (బి) ఇషాంత్ 4, మన్‌దీ్‌ప (బి) అక్షర్ 12, రింకూ (సి) లలిత్ (బి) అక్షర్ 6, నరైన్ (సి) వార్నర్ (బి) ఇషాంత్ 4, రస్సెల్ (నాటౌట్) 38, అనుకూల్ (ఎల్బీ) కుల్దీప్ 0, ఉమేశ్ (సి అండ్ బి) నోకియా 3, వరుణ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 127 ఆలౌట్; వికెట్ల పతనం: 1-15, 2-25, 3-32, 4-50, 5-64, 6-70, 7-93, 8-93, 9-96; బౌలింగ్: ఇషాంత్ 4-0-19-2, ముకేష్ 4-0-34-1, నోకియా 4-0-20-2, అక్షర్ 3-0-13-2, మార్ష్ 2-0-25-0, కుల్దీప్ 3-0-15-2,
ఢిల్లీ: వార్నర్ (ఎల్బీ) వరుణ్ 57, పృథ్వీ షా (బి) వరుణ్ 13, మార్ష్ (సి/సబ్) వీస్ (బి) రాణా 2, ఫిల్ సాల్ట్ (సి అండ్ బి) అనుకూల్ 5, మనీష్ పాండే (సి) రింకూ (బి) అనుకూల్ 21, అక్షర్ (నాటౌట్) 19, అమన్ (బి) రాణా 0, లలిత్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.2 ఓవర్లలో 128/6; వికెట్ల పతనం: 1-38, 2-62, 3-67, 4-93, 5-110, 6-111; బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 1-0-6-0, కుల్వంత్ 1.2-0-20-0, రస్సెల్ 1-0-12-0, నరైన్ 4-0-36-0, వరుణ్ 4-1-16-2, అనుకూల్ రాయ్ 4-0-19-2, నితీష్ రాణా 4-0-17-2.