Sanjitha : డోపింగ్‌లో పట్టుబడిన సంజిత

ABN , First Publish Date - 2023-01-08T00:37:28+05:30 IST

వెయిట్‌ లిఫ్టర్‌, రెండుసార్లు కామన్వెల్త్‌ చాంపియన్‌ సంజితా చాను మరోసారి డోపింగ్‌లో పట్టుబడింది.

Sanjitha : డోపింగ్‌లో పట్టుబడిన సంజిత

న్యూఢిల్లీ: వెయిట్‌ లిఫ్టర్‌, రెండుసార్లు కామన్వెల్త్‌ చాంపియన్‌ సంజితా చాను మరోసారి డోపింగ్‌లో పట్టుబడింది. గతేడాది సెప్టెంబరు-అక్టోబరులో జరిగిన జాతీయ క్రీడల్లో చాను నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధ ఉత్ర్పేరకాల ఆనవాళ్లు ఉన్నట్టు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. కానీ, అనుమానం వ్యక్తం చేసిన చాను.. స్వయంగా దగ్గరుండి ‘బి’ శాంపిల్‌ను టెస్ట్‌ చేయించినా.. పాజిటివ్‌గా రావడంతో ఆమె కంగుతింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నా.. నిషేధిత ఉత్ర్పేరకం తన శరీరంలోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని సంజిత చెప్పింది. 2018లో కూడా ఆమెపై డోపింగ్‌ ఆరోపణలు వచ్చినా.. సేకరించిన శాంపిల్‌పై స్పష్టత లేకపోవడంతో 2020లో నిషేధాన్ని ఎత్తి వేశారు. కానీ, రెండోసారి డోపింగ్‌లో పట్టుబడడంతో వాడా ప్యానెల్‌ ముందు ఆమె హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దోషిగా తేలితే నాలుగేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.

Updated Date - 2023-01-08T00:37:29+05:30 IST