ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు
ABN , First Publish Date - 2023-04-07T21:57:11+05:30 IST
ఆసిఫాబాద్, ఏప్రిల్ 7: ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే వేడు కలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని జన్కాపూర్, సందీప్‌నగర్, దస్నాపూర్, రాజంపేట, వైఎస్‌నగర్,పైకాజీనగర్‌కాలనీల్లోని చర్చీల్లో పాస్టర్లు ప్రత్యేకప్రార్థనలను నిర్వహించారు.

సిర్పూర్(టి): మండలకేంద్రంలో శుక్రవారం గుడ్‌ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కౌటాల: మండలంలోని విజయనగరం, కౌటాల మండలకేంద్రంలోని కల్వరిగుట్టపై క్రైస్తవులు ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు. మండలకేంద్రంతోపాటు యాపలగూడ, బాలాజీ అనుకోడ, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ నుంచి వచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫాదరు సిజో బెర్నాల్డ్, టోం, సతీష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.