Share News

Mancherial: సింగరేణిలో పొలిటికల్ హీట్..

ABN , Publish Date - Dec 24 , 2023 | 09:47 AM

మంచిర్యాల: సింగరేణిలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ -సీపీఐ మధ్య సయోధ్య కుదరలేదు. ఎన్నికల్లో రెండు పార్టీల అనుబంధ సంఘాలు తలపడుతున్నాయి. ఐఎన్‌టీయూసీకి మద్దతుగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు.

Mancherial: సింగరేణిలో పొలిటికల్ హీట్..

మంచిర్యాల: సింగరేణిలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ -సీపీఐ మధ్య సయోధ్య కుదరలేదు. ఎన్నికల్లో రెండు పార్టీల అనుబంధ సంఘాలు తలపడుతున్నాయి. ఐఎన్‌టీయూసీకి మద్దతుగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఏఐటీయూసీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. కాగా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌లో గందరగోళం కొనసాగుతోంది.

కాగా సింగరేణి ఎన్నికలను కార్మికులు బహిష్కరించాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి కార్యదర్శి ప్రభాత్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ సెంటిమెంట్‌తో గెలిచిన టీబీజీకేఎస్ కూడా కార్మికులను మోసం చేసిందని చెప్పారు. సింగరేణిలో కుంభ కోణాలు, అవినీతి, అణచి వేతలో కార్మిక సంఘాల పాత్ర కూడా ఉందని ప్రభాత్ తెలిపారు.

మరోవైపు శ్రీరాంపూర్‌లో సింగరేణి ఎన్నికల రగడ నెలకొంది. ఐఎన్టీయూసీ నేతల సమావేశంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పాత -కొత్త నాయకుల మధ్య విభేదాలు ముదిరి తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. టీబీజీకేఎస్ నాయకులను చేర్చుకోవడంపై సీనియర్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీబీజేఎస్ నుంచి వచ్చిన నేతల వల్ల ఎన్నికల్లో నష్ట పోతామని ఆందోళన వ్యక్తం చేశారు.

The video is not available or it's processing - Please check back later.

Updated Date - Dec 24 , 2023 | 09:47 AM