Revanth Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యమ కేసుల ఎత్తివేతపై ఆదేశాలు
ABN , First Publish Date - 2023-12-08T20:51:14+05:30 IST
తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతపై రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ డీజీపీ రవిగుప్తా ( DGP Ravigupta ) రంగంలోకి దిగారు. 2014 జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతపై రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ డీజీపీ రవిగుప్తా ( DGP Ravigupta ) రంగంలోకి దిగారు. 2014 జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండో తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను ప్రభుత్వం ఎత్తివేయనున్నది. రేవంత్ ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.