Congress to BRS Leaderes : కీలక నేతకు గాలం!
ABN , First Publish Date - 2023-07-27T01:14:02+05:30 IST
కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన కీలక నేత బీఆర్‌ఎస్‌లో చేరనున్నారా? పార్టీలో కొన్నాళ్లుగా ఉక్కుపోతకు గురవుతున్న ఆ నేతకు సీఎం కేసీఆర్ గాలం వేశారా? అంటే అవుననే ప్రచారమే జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి 2 అసెంబ్లీ స్థానాలకు బాధ్యుడు, మరో సీనియర్ నేత కోసం కేసీఆర్ ప్రయత్నం
మెదక్ జిల్లాలోనూ అదే పాచిక.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనపరిచే యత్నం
అసంతృప్త నేతలకు ఆహ్వానం.. కాంగ్రెస్ బలంగా ఉన్నచోటే దెబ్బతీసే వ్యూహం
తొలి టార్గెట్‌గా నల్లగొండ జిల్లా.. ఇప్పటికే భువనగిరి డీసీసీ అధ్యక్షుడి చేరిక
హైదరాబాద్/నల్లగొండ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్(Congress)కు కంచుకోటగా భావించే ఉమ్మడి నల్లగొండ జిల్లా(Nalgonda District)లో ఆ పార్టీకి భారీ షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన కీలక నేత బీఆర్‌ఎస్(BRS)లో చేరనున్నారా? పార్టీలో కొన్నాళ్లుగా ఉక్కుపోతకు గురవుతున్న ఆ నేతకు సీఎం కేసీఆర్ గాలం వేశారా? అంటే అవుననే ప్రచారమే జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్న ఆ నేత.. కొద్దికాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను పార్టీ మారతానంటూ రాష్ట్ర నాయకత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. పైగా ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతను కాంగ్రెస్‌లో చేర్చుకొని అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందంటూ తమ నియోజకవర్గంలో సర్వే కూడా చేయిస్తున్నారని అనుచరుల వద్ద వాపోతున్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంతో తన ఇమేజీ కూడా దెబ్బ తింటోందని భావిస్తున్నారు. పైగా బీఆర్‌ఎస్ నుంచి ఆఫర్ వచ్చిందని, ఆ పార్టీలోకి వెళితే ఎలా ఉంటుందని చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. మరోసారి బీఆరెస్సే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన అంచనా వేస్తున్నారని, ఆ పార్టీలో చేరితే తమకు రెండు ఎమ్మెల్యే స్థానాలతోపాటు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నేత గులాబీ గూటికి చేరవచ్చన్న అనుమానాలు కాంగ్రెస్‌లో నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన మరో మరో సీనియర్ కాంగ్రెస్ నేతకు కూడా బీఆర్‌ఎస్ నుంచి ఆఫర్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా తమకు పదవి దక్కే అవకాశాలు లేవన్న ఉద్దేశంతో ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
దీంతోపాటు మెదక్ జిల్లా(Medak District)కు చెందిన మరో సీనియర్ నేతకు కూడా కేసీఆర్ గాలం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హామీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, సుదీర్ఘ పాలన, వైఫల్యాలు తదితర కారణాలతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల మెజారిటీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారంలో ఉంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల(Karnataka Election Results) ముందు ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రె్‌సతో పోటీ పడిన బీజేపీ.. ఫలితాల తర్వాత డీలా పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో కాంగ్రె్‌సను వీడదామన్న యోచనలో ఉన్న అనేక మంది నాయకులు.. తిరిగి సర్దుకున్నారు. దీనికితోడు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లోని పలువురు అసంతృప్త నేతలు కాంగ్రె్‌సలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఉన్నారు. దీంతో ముందు ముందు ఇది ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళన బీఆర్‌ఎ్‌సలో మెదలైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ప్రభావం చూపగల కాంగ్రెస్ నేతలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ వ్యూహా లు(CM KCR's strategies) అమలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. తద్వారా కాంగ్రె్‌సను బలహీనపరచాలనే వ్యూహంతో ముందుకెళ్తునట్లు, కర్ణాటక ఎన్నికల ఫలితం ఇచ్చిన ఉత్సాహం.. నేతల చేరికలతో ఉరకలు వేస్తున్న ఆ పార్టీకి భారీగా గండి కొట్టే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
చేరికల్లో ద్విముఖ వ్యూహం..!
కాంగ్రె్‌సను బలహీనపరిచేందుకు కేసీఆర్ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు క్షేత్రస్థాయిలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ.. ప్రభావం చూపగల నేతలపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. తద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రె్‌సను దెబ్బకొట్టడం, అదే సమయంలో రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేసి బలహీనపరిచే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత రాష్ట్రంలో పార్టీకి ఒక ఉత్సాహం వచ్చినట్లయింది. ప్రజాకర్షక నేత అధ్యక్షుడు కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో కదలిక వచ్చింది. అయితే నేతలను కలుపుకొనిపోవడం లేదన్న ఆరోపణలూ పార్టీలో వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డికి, పార్టీలోని పలువురు నాయకులకు మధ్య తీవ్ర అంతరం పెరిగింది. బీఆర్‌ఎస్ కోవర్టులంటూ సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి అధిష్ఠానం వద్ద ఒకరిపై ఒకరి ఫిర్యాదుల పరంపరా చోటుచేసుకుంది. ఈ క్రమంలో అసంతృప్త నేతలకు తగిన హామీలు ఇచ్చి.. పార్టీలో చేర్చుకోవాలని, వారితోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఎదురుదాడి చేయించాలని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కవ సీట్లు వస్తాయని భావిస్తున్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాపై తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. భువనగరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారంటేనే కాంగ్రెస్ నుంచి చేరికలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. అయితే అనిల్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీగా బరిలోకి దించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్న చర్చ తాజాగా జరుగుతోంది. కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసారి నల్లగొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించడంతో.. బీఆర్‌ఎస్ తరఫున తాను సులువుగా గెలుస్తానన్న అభిప్రాయంతో అనిల్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి..
కాంగ్రెస్ నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తుంటే.. నల్లగొండ జిల్లాలో కొందరు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రె్‌సలో చేరేందుకు మార్గం సుగమమైంది. ఆయన పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ద్వారా రేవంత్‌రెడ్డికి టచ్‌లోకి వెళ్లారు. ఆయనతోపాటు కోదాడ బీఆర్‌ఎస్ నాయకుడు కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి సైతం కాంగ్రె్‌సలో చేరనున్నట్లు సమాచారం. మొత్తంగా రాబోయే 15 రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎ్‌సకు, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సకు వలసలు, రాజకీయ కుదుపులు తప్పవన్న ప్రచారం జరుగుతోంది.