Delhi Liquor Scam: రేపటి ఈడీ విచారణపై తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత
ABN , First Publish Date - 2023-03-15T17:51:24+05:30 IST
రేపు ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరవుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kalvakuntla Kavitha) తెలిపారు.
ఢిల్లీ: రేపు (గురువారం) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరవుతున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kalvakuntla Kavitha) తెలిపారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతానని ఆమె చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం ఆగదని, మహిళలకు తమ పార్టీతో సహా ఎవరూ ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదని కవిత అన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్నామని కవిత పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బిల్లు కోసం ఒత్తిడి చేస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో(Delhi Liquor Scam) కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) (ఈడీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. ఈడీ విచారణ అనంతరం కవిత ఢిల్లీ నుంచి రాత్రి హైదరాబాద్(Delhi to Hyderabad) చేరుకున్నారు. అయితే విచారణ ఇంతటితో ముగియలేదని, 16న మరోసారి హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు సూచించారు. మరోసారి హాజరు కావాల్సి ఉండడంతో ఇంకా కొంత ఆందోళనతో ఉంది. విచారణ నుంచి బయటికి వచ్చిన కవిత ఉత్సాహంగానే కనిపించారు. కార్యాలయం లోపలికి వెళ్లేటప్పుడు చేసినట్లుగానే.. బయటికి వచ్చినప్పుడు కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీఆర్‌ఎస్, భారత్ జాగృతి కార్యకర్తల నిరసనల నడుమ హాజరైన కవితను ఈడీ అధికారులు దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు విచారించిన ఈడీ అధికారులు.. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.
ఇప్పటికే.. కవిత వాడుతున్న పర్సనల్ ఫోన్‌ను (Kavitha Personal Phone) ఇంటి నుంచి తెప్పించి మరీ ఈడీ సీజ్ చేసింది. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయానికి సంబంధించిన.. కీలక సాక్ష్యాలను ముందుంచి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కవిత వాడిన ఫోన్లలోని సమాచారాన్ని ఈడీ ముందుంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో 2 సెల్‌ఫోన్లు, 10 సిమ్‌కార్డులు మార్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్‌లో వాటాలు, రూ.100 కోట్ల ముడుపులపై ఈడీ ఆరా తీశారు. లిఖితపూర్వకంగా కూడా కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది.