Kavitha ED Enquiry Live Updates : ముగిసిన కవిత ఈడీ విచారణ.. ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకూ ఏం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-03-11T10:56:23+05:30 IST
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) నేడు ఈడీ విచారిస్తుండటంతో (Kavitha ED Enquiry) తెలుగు రాష్ట్రాలతో పాటు అటు హస్తినలో (Kavitha Delhi) కూడా రాజకీయం వేడెక్కింది. కవితకు మద్దతుగా ఆమె సోదరుడు తెలంగాణ మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు.
08:50 pm హైదరాబాద్‌కు కవిత తిరుగుపయనం..
* ఈడీ కార్యాలయం నుంచి నేరుగా ఢిల్లీలోని ఇంటికెళ్లిన కవిత
* కవితకు హారతులు పట్టి స్వాగతం పలికిన బీఆర్ఎస్ మహిళా నేతలు
* ఈడీ విచారణ తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు కవిత పయనం
* మంత్రులు కేటీఆర్, హరీష్.. మహిళా మంత్రులతో కలిసి బయల్దేరిన కవిత
08:17 pm : ఆ రోజున మళ్లీ రండి..!
* ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులు
08:00 pm : ముగిసిన కవిత విచారణ
9 గంటలపాటు కొనసాగిన కవిత ఈడీ విచారణ
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన విచారణ
08:00 pm : కొనసాగుతున్న కవిత విచారణ
* 9 గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ
* ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ
* PMLA సెక్షన్ 50 కింద కవితపై ఈడీ ప్రశ్నల వర్షం
* ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ PMLA సెక్షన్ కింద కవిత స్టేట్మెంట్ రికార్డ్
06:30 pm: సాయంత్రం 6.30 దాటినా ముగియని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
* రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను బయటకు పంపని ఈడీ
* ఈడీ వైఖరితో ఆందోళనలో బీఆర్‌ఎస్ శ్రేణులు
* ఈడీ ప్రాంగణం వెలుపల ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఖాళీ చేయిస్తున్న పోలీసులు
* ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఏడు గంటలకు పైగా విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు
06:00 pm: ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో ఏడు గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ
* 06.30కు కవిత విచారణ ముగిసే అవకాశం
* విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు జరగనున్నాయోననే ఉత్కంఠలో రాజకీయ వర్గాలు, బీఆర్‌ఎస్ శ్రేణులు
05:45 pm: సాయంత్రం 6:30 గంటల వరకు కవితను ఈడీ విచారించే అవకాశం
* సమయం చాలకపోతే మరో తేదీన విచారణకు పిలిచే అవకాశం
* సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన విచారణ
* ఉదయం 11 గంటల నుంచి మొదలైన కవిత ఈడీ విచారణ
* సాయంత్రం 3 గంటలకు కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ
* దాదాపు 7 గంటలుగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం
05:03 pm: కవిత ఫోన్‌ను సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు..
* ఆమె డ్రైవర్‌ను ఇంటికి పంపి మొబైల్ ఫోన్‌ను ఈడీ ఆఫీస్‌కు తెప్పించిన అధికారులు
* అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ
04:20 pm: మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లాలని బీఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశాలు
* ఐదు గంటలుగా కవితను ప్రశ్నిస్తున్న ముగ్గురితో కూడిన ఈడీ అధికారుల బృందం
* కవిత ఫోన్‌ను కూడా ఈడీ అటాచ్ చేయడంతో అరెస్ట్ చేయడం ఖాయమంటున్న జాతీయ మీడియా
03:33 pm : తెలంగాణ వ్యాప్తంగా బండిపై ఫిర్యాదులు
* తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఫిర్యాదులు
* బంజారాహిల్స్ పీఎస్‌లో బండిపై కేసు నమోదు
* ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఫిర్యాదు
03:26 pm : గవర్నర్ ఏం చేస్తున్నారు..?
* తెలంగాణలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ ఏం చేస్తున్నారు : సత్యవతి రాథోడ్
* బండి సంజయ్ వ్యాఖ్యలపై తమిళసై స్పందించాలి
* గవర్నర్ ఉద్దేశం ఏంటో చెప్పాలి..?
03:15 pm : కవిత జోలికొచ్చారో...!
* కవిత జోలికి వస్తే తెలంగాణ అట్టుడికి పోతుంది : తలసాని సాయి
* బీజేపీ లీడర్స్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వం
* కవిత వెంటే మేమంతా ఉంటాం
03:12 pm : మోడీపై కన్నెర్ర
* కేసీఆర్‌ను మోదీ రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు : ఎమ్మెల్యే దానం నాగేందర్
* బండి సంజయ్ మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
* ప్రధాని మోదీ కావాలనే కవితపై కేసులు పెట్టిస్తున్నారు
* ఈడీ, సీబీఐలను మోదీ వాడుకుంటున్నారు : దానం
02:52 pm : సుమోటోగా తీసుకున్న మహిళ కమిషన్
* ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్
* బండి సంజయ్‌కు నోటీసులిచ్చిన మహిళా కమిషన్
* వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు
* విచారణ జరపాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం
02:42 pm : మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని..
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణతో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ముఖ్యంగా.. కవిత గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కన్నెర్రజేస్తున్నారు. బండి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. మరోవైపు.. సంజయ్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు.
02:05 pm: ఈడీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన
* కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈడీ కార్యాలయం ముందు బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు
* ఇప్పటికే ఈడీ కార్యాలయం ప్రధాన గేటు మూసివేత
* ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
01:40 pm: ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో రెండు గంటలుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
* కవితను ప్రశ్నిస్తున్న ముగ్గురు అధికారుల బృందం
12:40 pm: ‘‘కవితను ఈడీ వాళ్లు ముద్దుపెట్టుకుంటరా.. అరెస్ట్ చేయకుంటే‘’.. అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్ శ్రేణులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు బండి సంజయ్ దిష్టిబొమ్మను తగులబెట్టి ఆందోళన
12.30 pm: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో పది తలల రావణుడిలా మోదీని చిత్రీకరిస్తూ వెలసిన పోస్టర్..
* పోస్టర్‌లో మోదీ ముఖంతో పాటు మిగిలిన తొమ్మిది తలల్లో పలు కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు, అదానీ పేరు
12:15 pm: హస్తినలో ఆసక్తికరంగా మారిన బీఆర్‌ఎస్ రాజకీయం
* దేశ రాజధానికి కొనసాగుతున్న మంత్రుల ప్రయాణం
* ఢిల్లీకి బయలుదేరిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
12:00 pm: కవిత ఈడీ విచారణ ప్రారంభం కావడంతో ప్రగతి భవన్ చేరుకుంటున్న నేతలు
* కాసేపటి క్రితమే ప్రగతి భవన్ చేరుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
* అందుబాటులో ఉన్న మంత్రులు అందరూ ప్రగతి భవన్ వెళ్లే అవకాశం
11:30 am: కవిత వెంట వచ్చిన భర్త అనిల్, లాయర్ మోహన్‌రావు
* అనిల్, లాయర్ మోహన్‌రావును బయటే ఆపేసిన ఈడీ
11:00 am: ఈడీ కార్యాలయానికి చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
* లిక్కర్ కుంభకోణంలో కవితను విచారించనున్న ఈడీ
10:50 am: ఢిల్లీలోని కేసీఆర్ నివాసం దగ్గర హైటెన్షన్
* ఈడీ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లే యోచనలో కవిత
* కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన BRS కార్యకర్తలు
* హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
10:45 am: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత
* ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్న కవిత
* లాయర్‌తో ఈడీ ఆఫీస్‌కు రానున్న ఎమ్మెల్సీ కవిత
10:40 am: ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర భద్రత పెంపు
* ఈడీ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు
* భారీగా బారికేడ్స్ ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు
10:35 am: ఢిల్లీకి మారిన తెలంగాణ పాలిటిక్స్
* హస్తినకు క్యూ కట్టిన తెలంగాణ మంత్రులు, నేతలు
* ఢిల్లీలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ముఖ్యనేతలు
* ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీ వెళ్లిన BRS నేతలు
10:34 am: హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం
* కవిత ఈడీ విచారణ నేపథ్యంలో నగరంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు
* CBI, ED, BJP బెదిరింపు రాజకీయాలంటూ పోస్టర్లు
* BJPలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ ఫొటోలతో ఫ్లెక్సీలు
* నిజమైన రంగులు వెలసిపోవు... బైబై మోదీ అంటూ పోస్టర్లు
10:30 am: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత
* కవిత, అరుణ్ పిళ్లై, సిసోడియాను కలిపి ఈడీ ప్రశ్నించే అవకాశం
* పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ ఆరా
* ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై ప్రశ్నించే అవకాశం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) నేడు ఈడీ విచారించనుండటంతో (Kavitha ED Enquiry) తెలుగు రాష్ట్రాలతో పాటు అటు హస్తినలో (Kavitha Delhi) కూడా రాజకీయం వేడెక్కింది. కవితకు మద్దతుగా ఆమె సోదరుడు తెలంగాణ మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత, కేటీఆర్, హరీష్ భేటీ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
మద్యం కుంభకోణం (Delhi Liquor Scam Case) విషయంలో ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, అమిత్ అరోరా, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరాలు కవిత పాత్రపై ఇప్పటికే వాంగ్మూలాల్లో స్పష్టంగా వివరించారు.
ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో మద్యం విధానం రూపకల్పనకు సంబంధించి జరిగిన సమావేశంలో కవిత పాల్గొన్నట్లు ఈడీ పలు సందర్భాల్లో కోర్టుకు తెలిపింది. కాగా, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినల్లి, మాగుంట రాఘవరెడ్డితో పాటు ఇతరులతో ఉన్న వ్యాపార సంబంధాలు.. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గం ద్వారా చెల్లించిన ముడుపులు.. ఇండోస్పిరిట్స్ కంపెనీలో అరుణ్ పిళ్లై పేరిట ఉన్న 32.5 శాతం వాటాలు.. వంటి అంశాలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు.