Hyderabad: టమాట రేట్లు ఎప్పుడు తగ్గుతాయో గానీ హైదరాబాద్‌లో చికెన్‌ ధరలు భారీగా తగ్గాయ్..!

ABN , First Publish Date - 2023-07-24T18:50:17+05:30 IST

హైదరాబాద్ నగరంలో చికెన్‌ ధరలు తగ్గాయి. నెల రోజుల క్రితం స్కిన్‌లెస్ కిలో రూ.280 నుంచి రూ.320 వరకు పలికాయి. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా వారం రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం స్కిన్‌లెస్ కిలో రూ.200, లైవ్‌ కోడి రూ.130-140 ఉండడంతో కొనుగోళ్లకు నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.

Hyderabad: టమాట రేట్లు ఎప్పుడు తగ్గుతాయో గానీ హైదరాబాద్‌లో చికెన్‌ ధరలు భారీగా తగ్గాయ్..!

స్కిన్‌లెస్ కిలో రూ.180-200

రిటైల్‌ దుకాణాల్లో లైవ్‌ రూ.130-140

ఎంతకూ దిగిరాని కూరగాయల రేట్లు

టమాట, మిర్చితో పాటు ఇతర రకాలూ అంతే..!

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో చికెన్‌ ధరలు తగ్గాయి. నెల రోజుల క్రితం స్కిన్‌లెస్ కిలో రూ.280 నుంచి రూ.320 వరకు పలికాయి. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా వారం రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం స్కిన్‌లెస్ కిలో రూ.200, లైవ్‌ కోడి రూ.130-140 ఉండడంతో కొనుగోళ్లకు నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. కూరగాయల ధరల కంటే కోడి మాంసం రేటు తక్కువగా ఉండడంతో దాన్ని తీసుకునేందుకు దుకాణాలకు క్యూ కట్టారు. 20 రోజులుగా నగరంలో కిలో టమాట రేటు రూ.150 వరకు పలుకుతోంది. రైతుబజార్లలో రూ.75 ఉంటున్నప్పటికీ సంతలు, కాలనీల్లో దుకాణాల్లో దానికి ఒకవంతు అదనంగా పెంచి విక్రయిస్తున్నారు. దీంతోపాటు పచ్చిమిర్చి రేటు ఘాటెక్కిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రిటైల్‌ దుకాణాల్లో కిలో రూ.160 పలుకుతోంది.


అలాగే బెండకాయ, క్యారట్‌, దొండకాయ కూడా రూ.50కి కిలో ఉంది. ఈ తరుణంలో రూ.500 పట్టుకుని మార్కెట్లకు వెళ్లినా సగం సంచి నిండా కూరగాయలు రాని పరిస్థితి నెలకొంది. అయితే ఓ వైపు కూరగాయల ధరలు మోతమోగుతున్న నేపథ్యంలో తాజాగా చికెన్‌ రేట్లు చేతికి అందుబాటులోకి రావడంతో ప్రజలు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో నచ్చిన కూరగాయలను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడంలేదు. టమాట రేట్లు ఎప్పుడు తగ్గుతాయోనని ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త పంట చేతికి వస్తే కానీ.. రేట్లు అదుపులోకి రావని, అప్పటివరకు ధరలు ఇలాగే ఉంటాయని రైతుబజార్‌ అధికారులు చెబుతున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-24T18:50:51+05:30 IST