Share News

Bhatti Vikramarka: భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:07 AM

Telanagana: భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. డిప్యూటీ సీఎం వెంట ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ ఐఏఎస్, ఓఎస్డీ కృష్ణ భాస్కర్ ఉన్నారు. ఉదయం 11:10 నిమిషాలకు భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం చేరుకోనున్నారు.

Bhatti Vikramarka: భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. డిప్యూటీ సీఎం వెంట ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ ఐఏఎస్, ఓఎస్డీ కృష్ణ భాస్కర్ ఉన్నారు. ఉదయం 11:10 నిమిషాలకు భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం చేరుకోనున్నారు. ఉదయం 11:20 గంటల నుంచి 12:30 గంటల వరకు భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12:40 గంటలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఎర్రుపాలెం గ్రామానికి డిప్యూటీ సీఎం భట్టి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 గంటలకు ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఎర్రుపాలెంలో మిషన్ భగీరథ పథకంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4:45 గంటలకు ఎర్రుపాలెం నుంచి హైదరాబాద్‌‌కు హెలికాప్టర్‌లో డిప్యూటీ సీఎం భట్టి బయలుదేరనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 30 , 2023 | 11:09 AM