KA Paul: ప్రగతిభవన్ వద్ద కేఏ పాల్ హల్‌ చల్

ABN , First Publish Date - 2023-07-03T15:25:14+05:30 IST

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రగతి భవన్ వద్ద హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానన్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

KA Paul: ప్రగతిభవన్ వద్ద కేఏ పాల్ హల్‌ చల్

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja Shanti Party President) కేఏ పాల్ (KA Paul) ప్రగతి భవన్ (Pragati Bhavan) వద్ద హల్‌ చల్ (Hal Chal) చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)ను కలిసేందుకు వచ్చానన్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అఖిలేష్ యాదవ్‌ (Akhilesh Yadav)కు అపాయింట్‌మెంట్ ఇచ్చి తనకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్ 2న నిర్వహించ బోయే ప్రపంచ శాంతి మహా సభలో పాల్గొనేందుకు ఆహ్వానం ఇచ్చేందుకు వచ్చానని పాల్ అన్నారు. దాని వల్ల తెలంగాణలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వచ్చానని కేఏ పాల్ తెలిపారు. అయినా పోలీసులు అనుమతించలేదు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-03T15:25:14+05:30 IST