పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి : సీతక్క

ABN , First Publish Date - 2023-06-07T10:08:39+05:30 IST

కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క పలు డిమాండ్లు చేశారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా రామప్ప నుంచి లక్నవరం వరకూ కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలన్నారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేసి, గిరిజన యూనివర్సిటీ తరగతులు వెంటనే ప్రారంభించాలన్నారు. పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు. మూతపడ్డ మంగపేట మండలం కమలాపూర్‌లో బిల్ట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సీతక్క డిమాండ్ చేశారు.

పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి : సీతక్క

ములుగు : కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క పలు డిమాండ్లు చేశారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా రామప్ప నుంచి లక్నవరం వరకూ కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలన్నారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేసి, గిరిజన యూనివర్సిటీ తరగతులు వెంటనే ప్రారంభించాలన్నారు. పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు. మూతపడ్డ మంగపేట మండలం కమలాపూర్‌లో బిల్ట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సీతక్క డిమాండ్ చేశారు. ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. మంగపేట కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాల, గోవిందరావుపేట మండలం పసర కేంద్రంగా సమ్మక్క సారలమ్మ నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలన్నారు. మల్లంపల్లి, లక్ష్మీదేవిపేట, రాజుపేటలను మండలాలుగా ప్రకటించాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

Updated Date - 2023-06-07T10:08:39+05:30 IST