Pocharam: పుట్టిన రోజు కంటతడి పెట్టిన తెలంగాణ స్పీకర్
ABN , First Publish Date - 2023-02-10T10:45:15+05:30 IST
బాల్య మిత్రుడి మరణం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని విషాదంలో ముంచింది.

హైదరాబాద్: బాల్య మిత్రుడి మరణం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Telangana Speaker Pocharam Srinivas Reddy)ని విషాదంలో ముంచింది. బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ (Childhood friend Salam Bin Ali Khan) మృతివార్త తెలిసి స్పీకర్ (Telangana Speaker) ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య మిత్రుడిని తలుచుకుంటూ పుట్టిన రోజు నాడే పోచారం కంటతడి పెట్టారు.
స్పీకర్ పోచారం నేటితో 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. ఆపై స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ... తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మరణం కలిచివేసిందన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందుకే నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు రద్దు చేశానని తెలిపారు. తన మిత్రుడు మరణంతో పోచారం కంటతడిపెట్టారు. సాలం బీన్ అలీఖాన్ అంత్యక్రియలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.