Bus Yatra: తెలంగాణలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర

ABN , First Publish Date - 2023-08-18T13:45:19+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో జరిగే బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు.

Bus Yatra: తెలంగాణలో టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో టీటీడీపీ (TTDP) ఆధ్వర్యంలో బస్సు యాత్ర (Bus Yatra) చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో జరిగే బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) పాల్గొంటారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సు యాత్రకు రూట్ మ్యాప్ (Route Map) సిద్ధమైంది. బస్సు యాత్ర జూబ్లీ హిల్స్ (Jubilee Hills) పెద్దమ్మగుడి (Peddamma Temple) నుంచి ప్రారంభం కానుంది. బస్సు యాత్రపై శనివారం చంద్రబాబు నాయుడు డేట్స్ ఫిక్స్ చేస్తారు. ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (Kasani Gnaneshwar Mudiraj) మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అభివృద్ధికి చంద్రబాబే కారణమన్నారు. గ్రేటర్‌లో టీడీపీ బస్సు యాత్రను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-18T13:45:19+05:30 IST