Hyderabad: కేసీఆర్-అఖిలేష్ భేటీ అందుకేనా?

ABN , First Publish Date - 2023-07-03T14:46:26+05:30 IST

యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేష్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి ప్రగతి భవన్‌కు అఖిలేష్ యాదవ్ చేరుకున్నారు.

Hyderabad: కేసీఆర్-అఖిలేష్ భేటీ అందుకేనా?

హైదరాబాద్: యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేష్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి ప్రగతి భవన్‌కు అఖిలేష్ యాదవ్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) తో అఖిలేష్ భేటీ కానున్నారు. ఈ భేటీకి బీఆర్ఎస్ ఎంపీలు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో దేశంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు కేసీఆర్-అఖిలేష్ సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే అఖిలేష్ యాదవ్.. విపక్షాల కూటమితో కూడా టచ్‌లో ఉంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌తో కూడా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్-ఎస్పీ పార్టీ నేతలు లంచ్ చేస్తున్నారు. అనంతరం ఇరు పార్టీల నేతలు సమావేశం కానున్నారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల భేటీపై పొలిటికల్‌గా ఉత్కంఠ రేపుతోంది.

kcr.jpg

Updated Date - 2023-07-03T14:51:13+05:30 IST