Vijayashanthi : బైలడిల్లా గనుల పేరుతో కేటీఆర్ తలాతోకా లేని ఆరోపణలు
ABN , First Publish Date - 2023-04-11T22:55:22+05:30 IST
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బైలడిల్లా గనుల(Bailadilla mines) పేరుతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi ) అన్నారు.
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బైలడిల్లా గనుల(Bailadilla mines) పేరుతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi ) అన్నారు. మంగళవారం సోషల్ మీడియా(Social media)లో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాములమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్తను యథప్రకారం ప్రచురిస్తున్నాం. ‘‘ గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున బయ్యారంలో స్టీల్ ప్లాంట్( Bayyaram Steel Plant )ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగితే... తలాతోకా లేకుండా బైలడిల్లా గనుల గురించి కేటీఆర్ మాట్లాడటం పూర్తిగా తప్పించుకునే ధోరణిగా ఉంది. సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ సర్కారు వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel) ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం పూర్తిగా మోసపూరితం.
తెలంగాణ(Telangana)లో మూతపడ్డ సంస్థలను పునరుద్ధరించడంపై కార్యాచరణ లేని మంత్రి కేటీఆర్... ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)పై అభాండాలు మోపడం అసమర్ధత తప్ప మరొకటి కాదు. అవినీతి మచ్చలేని ప్రధాని నరేంద్రమోదీపై కేటీఆర్ ఆరోపణలు చేయడం తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమే. నరేంద్ర మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు. ఫూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా(Air India) సంస్థను మినహా ఏ ప్రభుత్వ రంగ సంస్థను మోదీ పాలనలో ప్రైవేటుపరం చేశారో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలి. సంక్షోభంలో ఉన్న బీఎస్ఎన్ఎల్, హెచ్ఈఎల్ సంస్థలకు పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించి ఆదుకున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే. రామగుండం సహా మూతపడ్డ 5 ఎరువుల ఫ్యాక్టరీలను వేల కోట్లు ఖర్చు చేసి పునరుద్ధరించి, రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేస్తున్న ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే.
TSPSC పేపర్ లీకేజీ(TSPSC Paper Leakage) విషయంలో సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటపడడంతో మంత్రి కేటీఆర్ కొత్త ఎత్తుగడతో కేంద్రంపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఏది ఏమైనా TSPSC పేపర్ లీకేజీపై బీజేపీ(BJP) పోరు ఆగదు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకూ... నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకూ పోరాటాలను ఉధృతం చేస్తాం. కార్యచరణలో భాగంగా ఈనెల 15న వరంగల్(Warangal)లో తలపెట్టిన ‘‘నిరుద్యోగ మార్చ్’’కు నిరుద్యోగులంతా తరలిరావాలి. తెలంగాణ ప్రజల కోసం తప్పు అనిపించిన ఏ సమస్యనైనా అడగడం నా బాధ్యత. రాజకీయాలకు, పదవులకు ఇది సంబంధం లేని అంశం’’ అని విజయశాంతి పేర్కొన్నారు.