Bhadradri Dist.: పోడు పట్టాల పేరిట సర్పంచ్ అక్రమాలు
ABN , First Publish Date - 2023-07-06T16:40:50+05:30 IST
భద్రాద్రి జిల్లా: పోడు పట్టాల పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రొంపేడు సర్పంచ్ అజ్మీర శంకర్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని సర్పంచ్ శంకర్.. మరో ఇద్దరు వ్యక్తులను బినామీలుగా ఉంచి...
భద్రాద్రి జిల్లా: పోడు పట్టాల (Podu Pattalu) పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District)లో రొంపేడు సర్పంచ్ అజ్మీర శంకర్ (Sarpanch Ajmira Shankar) అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని సర్పంచ్ శంకర్.. మరో ఇద్దరు వ్యక్తులను బినామీలుగా ఉంచి డబ్బులు వసూలు చేశారంటూ బాధిత రైతులు పోలీసులు ఆశ్రయించారు. పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని అటవీశాఖ పరిధిలోకి భూములు వెళ్లకుండా చూస్తానని చెప్పి ఒక్కొక్క రైతు దగ్గర రూ. 15వేల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు. పట్టాలు ఇవ్వకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వమని సర్పంచ్‌ను అడగ్గా డబ్బులు ఇచ్చేది లేదని ఏం చేస్తారో చేసుకోండంటూ సర్పంచ్ అన్నారని బాధితులు వాపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు.