టీడీపీ జెండా కట్ట ధ్వంసం

ABN , First Publish Date - 2023-02-07T23:15:04+05:30 IST

నారాయణపేట మునిసిపాలిటీ 20, 21వ వార్డు గోపాల్‌పేట వీధి కూరగాయల మార్కెట్‌కు వెళ్లేదారిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన టీడీపీ జెండా కట్టను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశా రు.

టీడీపీ జెండా కట్ట ధ్వంసం
ధ్వంసం చేసిన జెండా కట్టను పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు

నారాయణపేట, ఫిబ్రవరి 7 : నారాయణపేట మునిసిపాలిటీ 20, 21వ వార్డు గోపాల్‌పేట వీధి కూరగాయల మార్కెట్‌కు వెళ్లేదారిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన టీడీపీ జెండా కట్టను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశా రు. కాగా కూల్చిన జెండా కట్టను మంగళవారం టీడీపీ నాయకులు వినయ్‌మి త్ర, రాఘవరావు, భాస్కర్‌రెడ్డి, ప్రసాద్‌, ఓంప్రకాష్‌, మనోహర్‌, శివకుమార్‌, వీర న్న, రమేష్‌ సందర్శించి మాట్లాడారు. అధికార మదంతో బీఆర్‌ఎస్‌ నాయకులు కొంతకాలంగా టీడీపీ జెండా కట్టలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. గతం లోని ప్రభుత్వాలు ఇలానే ప్రవర్థించి ఉంటే టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించేదా? బీఆర్‌ఎ స్‌గా రూపాంతరం చెందేదా అని ప్రశ్నించారు. కోటకొండలో టీడీపీ కార్యాలయా న్ని కబ్జా చేశారని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినా జెండా కట్టల ధ్వంసం పరంపర ఆగడం లేదన్నారు. అధికారం శాశ్వితం కాదని, రాబోయే కాలంలో బీఆర్‌ఎస్‌ పునాదులు కదులుతాయని అది ఇంకెంతో దూరం లేదన్నారు.

Updated Date - 2023-02-07T23:15:06+05:30 IST