MLA Marri Janardhan Reddy: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2023-08-15T02:44:20+05:30 IST

నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.

MLA Marri Janardhan Reddy: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్ని క చెల్లదని పేర్కొంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి, సమీప ప్రత్యర్థి నాగం జనార్దన్‌ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ (ఈపీ)ని హైకోర్టు కొట్టేసింది. మర్రి జనార్దన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో పలు ఆస్తుల వివరాలను వెల్లడించకుండా దాచిపెట్టారని పేర్కొంటూ నాగం 2019లో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్‌ అనుపమా చక్రవర్తి ధర్మాసనం సోమవారం పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. ఆరోపణలకు ఆధారాలు సమర్పించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-15T03:08:33+05:30 IST