Sircilla Naveen: పాపం నవీన్.. ‘‘జీవితంలో సంతృప్తి లేదు. ఉద్యోగం లేదు’’ అని లెటర్ రాసి..

ABN , First Publish Date - 2023-03-18T13:38:17+05:30 IST

ఉద్యోగం లేదన్న మనస్తాపంతో ఓ 31 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘జీవితంలో సంతృప్తి లేదు. ఉద్యోగం లేదు. నా వల్ల ఎవరికీ..

Sircilla Naveen: పాపం నవీన్.. ‘‘జీవితంలో సంతృప్తి లేదు. ఉద్యోగం లేదు’’ అని లెటర్ రాసి..

ఉద్యోగం లేదని యువకుడి ఆత్మహత్య

నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.. నా చావుకు ఎవరూ కారణం కాదు

సూసైడ్‌ నోట్‌ రాసి ఎవరూ లేని సమయంలో బలవన్మరణం

సిరిసిల్ల: ఉద్యోగం లేదన్న (Unemployment) మనస్తాపంతో ఓ 31 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘జీవితంలో సంతృప్తి లేదు. ఉద్యోగం లేదు. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను వెళ్తున్నా’’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఉరివేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla District) కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డినగర్‌లో (Yellareddy Nagar) శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డినగర్‌కు చెందిన నాగభూషణం, సుగుణ దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్నకొడుకు నవీన్‌ సిరిసిల్లలో (Naveen Sircilla) పదేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివాడు. తర్వాత పలు ప్రైవేటు కంపెనీల్లో ఇంటర్వ్యూలకు వెళ్లాడు. కొంత కాలం ఓ షాపింగ్‌ మాల్‌లో (Shopping Mall) ఉద్యోగం చేసి ఆరునెలల క్రితం రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే ఉద్యోగం లేదన్న మనస్తాపంతో సూసైడ్‌ నోట్‌ రాసి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు.

నవీన్‌ గతంలో గ్రూప్స్‌ పరీక్షలు రాసి విఫలమయ్యాడని, ఇటీవల సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకొని ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకున్నాడని, ప్రస్తుతం గ్రూప్‌4కు సన్నద్ధం అవుతున్నాడనీ, ఇంతలోనే ఇక ఉద్యోగం రాదేమోననుకొని ఆత్మహత్య చేసుకున్నాడని నవీన్‌ తండ్రి నాగభూ షణం తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-03-18T13:38:17+05:30 IST