బీజేపీ, బీఆర్‌ఎస్ దొందూ దొందే
ABN , First Publish Date - 2023-06-27T00:17:55+05:30 IST
రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనను తుదముట్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, ప్రజాకంఠక పాలనలో బీఆర్ ఎస్, బీజేపీ రెండూ ఒకటే అని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు.

కందుకూరు, జూన్ 26: రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనను తుదముట్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, ప్రజాకంఠక పాలనలో బీఆర్ ఎస్, బీజేపీ రెండూ ఒకటే అని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణానాయక్ అధ్యక్షతన పీసీసీ మెంబర్లు ఏనుగు జంగారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డిలతో కలిసి ముచ్చర్ల, ఊట్లపల్లి గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలందరూ బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ప్రజల్లో రాజకీయ పునరేకీకరణ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డి, భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత కోసమే కాంగ్రెస్ పార్టీని బలపర్చాలన్నారు. అనంతరం ముచ్చర్ల, ఊట్లపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు ధన్‌రాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొక్క భూపాల్‌రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహాచారి, ప్రధానకార్యదర్శి వినోద్‌చారి, ప్యాక్స్ మాజీ చైర్మన్ ఎస్ మల్లేష్, నాయకులు రామకృష్ణ, ఎస్‌డి అజీజ్, సి.మల్లేష్, నిరంజన్, అజయ్, ఊటురాజు, వరికుప్పల బాబు, మల్లేష్, నరిసింహ తదితరులు పాల్గొన్నారు.