యాదవరెడ్డితో కేఎల్లార్‌ భేటీ

ABN , First Publish Date - 2023-08-08T00:35:08+05:30 IST

మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డితో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు.

యాదవరెడ్డితో కేఎల్లార్‌ భేటీ
మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డితో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 7: మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డితో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. వీరి భేటీ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ, సామాజిక, తదితర అంశాలపై సుమారు గంట పాటు చర్చించారు. రాజకీయాల్లో మళ్లీ ఉత్సాహంగా పాల్గొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా ముందుకు సాగాలని కేఎల్లార్‌... యాదవరెడ్డిని కోరారు. దీంతో తాను తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని కేఎల్లార్‌కు ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 14సీట్లు కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ఇద్దరు నేతలు ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గ పార్టీ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, గౌరీ సతీష్‌, ప్రతా్‌పరెడ్డి, దేవర వెంకట్‌రెడ్డి, బండారు ఆగిరెడ్డి, యాలాల మహేశ్వర్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌, పెంటయ్యగౌడ్‌, బేగరి శ్రీనువాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-08T00:35:08+05:30 IST