Share News

కొడంగల్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

ABN , Publish Date - Dec 25 , 2023 | 11:31 PM

కొడంగల్‌ జిల్లా కేంద్రంగా ప్రకటించి చార్మినార్‌ జోన్‌లోనే కొనసాగే విధంగా చూడాలని కొడంగల్‌ జేఏసీ నాయకులు ఎరన్‌పల్లి శ్రీనివాస్‌, బసప్ప, మడిగే శ్రీనివాస్‌, బుస్స చంద్రయ్య, రమేశ్‌బాబు, భీమారాజ్‌ అన్నారు.

కొడంగల్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న జేఏసీ నాయకులు

కొడంగల్‌, డిసెంబరు 25: కొడంగల్‌ జిల్లా కేంద్రంగా ప్రకటించి చార్మినార్‌ జోన్‌లోనే కొనసాగే విధంగా చూడాలని కొడంగల్‌ జేఏసీ నాయకులు ఎరన్‌పల్లి శ్రీనివాస్‌, బసప్ప, మడిగే శ్రీనివాస్‌, బుస్స చంద్రయ్య, రమేశ్‌బాబు, భీమారాజ్‌ అన్నారు. కొడంగల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్‌ను మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి మార్చుతున్నారని జోరుగా చర్చ జరుగుతుందని, మహబూబ్‌నగర్‌ జిల్లాలో విలీనం చేస్తే కొడంగల్‌ వెనకబాటుకు గురవుతుందన్నారు. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం సంతోషించదగ్గ విషయమనిన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ను జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేర్చమని ప్రకటన ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో దస్తప్ప, గాయకుడు బలరాం, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లికి పూజలు

కొడంగల్‌ రూరల్‌: కొడంగల్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ నియోజకవర్గంలోని పలువురు నిరుద్యోగులు, నాయకులు సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని రెండు మండలాలను నారాయణపేట్‌లో, మూడు మండలాలను వికారాబాద్‌లో విలీనం చేసి విచ్చిన్నం చేశారన్నారు. పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాలను కలిపి కొడంగల్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీరటి దశరథ్‌, నందీమని, వెంకటయ్య, కే.నర్సింహులు, కే.వెంకటయ్య, నందమని రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 11:31 PM