Share News

Congress : వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

ABN , First Publish Date - 2023-10-29T06:11:56+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో భేటీ అయ్యారు.

Congress : వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

  • పార్టీలోకి రావాలని ఆహ్వానం?

మొయినాబాద్‌ రూరల్‌ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ పరిధిలోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్‌ గన్‌మెన్‌ కూడా లేకుండా ఒంటరిగా వచ్చారు. దాదాపు గంటన్నరపాటు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా వివేక్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్‌ ఆహ్వానించినట్లు సమాచారం. కాగా, వివేక్‌ కాంగ్రెస్‌లో చేరతారంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఈ భేటీతో బలం చేకూరినట్లయింది.

Updated Date - 2023-10-29T06:21:12+05:30 IST