KCR: BRS పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నిర్ణయాలు
ABN , First Publish Date - 2023-01-29T18:10:09+05:30 IST
BRS పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ (CM KCR) కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్: BRS పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ (CM KCR) కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని BRS నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై అప్పటి పరిస్థితులను బట్టి వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికి పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను గవర్నర్లతో కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఎంపీలతో సీఎం కేసీఆర్ చెప్పారు. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం ఆదేశించారు.