Share News

Singareni: సింగరేణిలో మొదలైన ప్రలోభాల పర్వం..

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:43 AM

సింగరేణిలో ప్రలోభాల పర్వం మొదలైంది. భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ కేటీకే వన్ ఇంక్లైన్‌లో మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మద్యం, డబ్బుల పంపిణీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఐఎన్టీయూసీ నాయకులే మద్యం, డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారని ఏఐటీయూసీ నేతలు ఆరోపిస్తున్నారు.

Singareni: సింగరేణిలో మొదలైన ప్రలోభాల పర్వం..

భూపాలపల్లి: సింగరేణిలో ప్రలోభాల పర్వం మొదలైంది. భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ కేటీకే వన్ ఇంక్లైన్‌లో మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మద్యం, డబ్బుల పంపిణీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఐఎన్టీయూసీ నాయకులే మద్యం, డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారని ఏఐటీయూసీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా.. బెల్లంపల్లి రీజియన్‌లో సింగరేణి ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో మొత్తం 31పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్‌లో అత్యధికంగా 9,124 ఓటర్లు, బెల్లంపల్లిలో 985, మందమర్రిలో 4876 ఓట్లర్లున్నారు. బ్యాలెట్ బాక్స్‌లతో పాటు బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేయనున్నారు. కార్మిక, రెవెన్యూ శాఖల అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:44 AM