BJP MLA: లైవ్ డిటెక్టర్‌కు పరీక్షకు సిద్ధమా?.. సీపీ రంగనాథ్‌కు రఘునందన్ సవాల్
ABN , First Publish Date - 2023-09-08T12:29:23+05:30 IST
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గాయాలైన విద్యార్థులను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీపీ రంగనాథ్ కేయూ విద్యార్థుల కేసును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. వరంగల్ సీపీ రంగనాథ్ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
వరంగల్: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో (Warangal Kakatiya University) గాయాలైన విద్యార్థులను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (BJP MLA Raghunandan rao) శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీపీ రంగనాథ్ (CP Ranganath) కేయూ విద్యార్థుల కేసును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. వరంగల్ సీపీ రంగనాథ్ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు. సీఎంలకు, షాడో సీఎంలు చెప్పినట్టు వినొద్దని హితవుపలికారు. విద్యార్థులను అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్ తరలించాలని.. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోకి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా లేదా గుండెపై చేయి వేసుకొని చెప్పండని డిమాండ్ చేశారు. విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే సీపీ రంగనాథ్ అవసరమా... అని అన్నారు. ఈ కేసులో సీపీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందన్నారు. వ్యవస్థలను ఎందుకు మేనేజ్ చేయాలనుకుంటున్నారని నిలదీశారు. లైవ్ డిటెక్టర్ పరీక్షకు సీపీ సిద్ధమా.. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని అన్నారు. సీపీ రంగనాథ్ అక్రమాలు వెలికితీస్తామని..ఆయనపై కోర్టులో కేసు ఫైల్ చేస్తామన్నారు. ఈ ఘటనపై న్యాయ పరంగా పోరాడతామని రఘునందన్ రావు వెల్లడించారు.