Share News

Baby Vomiting Causes: పిల్లలు పాలు కక్కేస్తూ ఉంటే

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:25 AM

పిల్లల్లో పాలు తాగిన తర్వాత వాంతులు రావడం సాధారణం. ఇది "గ్యాస్ట్రో ఈసోఫిగల్‌ రిఫ్లక్స్‌" వల్ల జరుగుతుంది. పిల్లలు బరువు పెరుగుతూ ఉంటే ఈ లక్షణం ప్రమాదకరమైంది కాదు.

Baby Vomiting Causes: పిల్లలు పాలు కక్కేస్తూ ఉంటే

కౌన్సెలింగ్

డాక్టర్‌! మా బాబుకు రెండు నెలలు. తల్లి పాలు తాగడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ పాలు తాగిన తర్వాత రోజులో మూడు నుంచి నాలుగు సార్లు వాంతి చేసుకుంటున్నాడు. ఇది ప్రమాదకర లక్షణమా?

- ఓ సోదరి, గుంటూరు

ఆరు నెలల లోపు పిల్లలకు పాలు, పెరుగు లాంటి వాంతులు కావడం సహజం. ఈ లక్షణాన్ని ‘గ్యాస్ట్రో ఈసోఫిగల్‌ రిఫ్లక్స్‌’ అంటారు. అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్య ఉండే కండరం వదులుగా ఉండడం మూలంగా పాలు కొంత మేరకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆరు నెలల వయసు వరకూ పిల్లల్లో ఈ వ్యవస్థ పూర్తిగా ఎదిగి ఉండదు. కాబట్టి ఇలా పాలు కక్కుకోవడం సహజం. కొంతమంది పిల్లల్లో ఈ సమస్య ఏడాది వరకూ కొనసాగవచ్చు. అయితే ఈ పరిస్థితి ప్రమాదకరమా? కాదా? అని తెలుసుకోవడానికి పిల్లల బరువును గమనించాలి. బిడ్డ బరువు తగ్గకుండా వారానికి 150 గ్రాముల చొప్పున క్రమేపీ బరువు పెరుగుతూ ఉంటే, పాలు వాంతి చేసుకుంటున్నా కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే కొందరు తల్లులు బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ పాలు పట్టించేస్తూ ఉంటారు.


ఇలా అవసరానికి మించి పాలు పట్టించినా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సీసా పాలు పట్టించే పిల్లల్లో కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి కారణం గమనించాలి. అలాగే పాలు తాగించిన వెంటనే బిడ్డను పడుకోబెట్టకుండా, 10 నిమిషాల పాటు భుజం మీద పడుకోబెట్టుకుని, త్రేన్పు వచ్చేవరకూ వెన్ను తట్టాలి. ఇలా చేసినా పిల్లలు పాలు కక్కేసుకోకుండా ఉంటారు.

- డాక్టర్‌ విజయానంద్‌ పీడియాట్రీషియన్‌ అండ్‌

నియోనాటాలజిస్ట్‌, హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Updated Date - Mar 27 , 2025 | 03:25 AM