AP Budget: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:01 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. సభలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులోభాగంగా రోడ్లు భవనాల శాఖకు రూ. 9,554 కోట్లను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 2,94,427.25 కోట్ల బడ్జెట్‌ను ఆయన సభ ముందుకు తీసుకు వచ్చారు. ఈ బడ్జెట్‌లో వివిధ శాఖలకు నిధులను కేటాయించారు. అందులోభాగంగా రహదారులు, రోడ్లతోపాటు భవనాల శాఖకు రూ. 9,554 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
గత జగన్ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో వివిధ శాఖలకు నిధులు కేటాయించ లేదు. దాంతో గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది. ఇక రోడ్లు, రహదారుల పరిస్థితి అయితే తీవ్ర అధ్వానంగా మారియి. ఓ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందంటే అందుకు రోడ్లు, రహదారులు కీలకమని గతంలో నారా చంద్రబాబు నాయుడు పాలనలో అంతా చూశారు. ఆ క్రమంలో ఈ శాఖకు రూ. 9,554 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
అయితే సంక్రాంతి నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారులు గుంతలు లేని లేకుండా ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం గుంతలు లేని రహదారుల ఆంధ్ర అనే మిషన్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వీటి పునర్నిర్మాణ యత్నాలు సైతం చురుకుగా జరుగుతున్నాయి. అలాగే రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానం చేయనుంది.
ఇక అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 189 కిలోమీటర్ల మేర రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ఎక్స్‌ప్రెస్ వే పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన రహదారులను వీటితో అనుసంధానం చేయనున్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే రాష్ట్రంలో 687 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల జాతీయ రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు నాలుగు వరుసల జాతీయ రహదారులు హైదరాబాద్ - విశాఖపట్నం, బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్ రహదారులలో 165 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి.
అదే విధంగా న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధానత, గ్రామీణ అనుసంధానత ప్రాజెక్టుతోపాటు ఆంధ్రప్రదేశ్ రహదారులు, వంతెనల పునర్నిర్మాణం ప్రాజెక్టులను సైతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. అందులోభాగంగా జిల్లా ప్రధాన కేంద్రాలు, మండల కేంద్రాల మధ్య.. అదే విధంగా అన్ని మండల కేంద్రాల మధ్య రెండ వరుసల రహదారులను అనుసంధానం చేయనుంది. ఇక జిల్లాల రహదారి పనులు 2025, మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం నిర్దేశించుకుంది.
For AndhraPradesh News And Telugu News...