satyakumar సత్యకుమార్‌యాదవ్‌కు శుభాకాంక్షల వెల్లువ
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:50 AM
ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ యాదవ్ ఇంటి వద్ద బుధవారం సందడి నెలకొంది. సత్యకుమార్‌యాదవ్ గెలుపొందడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

-ఆయన నివాసం వద్దకు భారీగా తరలివచ్చిన కూటమి శ్రేణులు
ధర్మవరం, జూన 5: ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ యాదవ్ ఇంటి వద్ద బుధవారం సందడి నెలకొంది. సత్యకుమార్‌యాదవ్ గెలుపొందడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
జనసేన రాష్ట్రప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి తన కార్యకర్తలు, నాయకులతో కలిసి వచ్చి సత్యకుమార్‌యాదవ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సత్యకుమార్ ఇంటి వద్ద ఉదయం 7గంటల నుంచే కూటమి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలపడానికి క్యూకట్టారు. అనంతరం ఆయన శివానగర్‌లోని శివాలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేయించారు. మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...