Share News

SAVITA : రైతుల భూముల తాకట్టుకు జగన సిద్ధం

ABN , Publish Date - May 12 , 2024 | 12:20 AM

రాష్ట్రంలోని రైతుల భూములు తా కట్టు పెట్టేందుకు ల్యాం డ్‌ టైట్లింగ్‌ చట్టం 2024 పేరుతో సైకో సీ ఎం జగన్మోహనరెడ్డి సి ద్ధంగా ఉన్నారని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత విమర్శించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. టీడీపీ స్థానిక కార్యాలయం వద్ద శనివారం నియోజకవర్గ పరిశీలకుడు నరసింహరావు, సవిత, టీడీపీ శ్రేణులు కలిసి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రతులను తగలబెట్టారు.

SAVITA : రైతుల భూముల తాకట్టుకు జగన సిద్ధం
Land Titling Act TDP leaders burning copies

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

పెనుకొండ టౌన, మే 11 : రాష్ట్రంలోని రైతుల భూములు తా కట్టు పెట్టేందుకు ల్యాం డ్‌ టైట్లింగ్‌ చట్టం 2024 పేరుతో సైకో సీ ఎం జగన్మోహనరెడ్డి సి ద్ధంగా ఉన్నారని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత విమర్శించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. టీడీపీ స్థానిక కార్యాలయం వద్ద శనివారం నియోజకవర్గ పరిశీలకుడు నరసింహరావు, సవిత, టీడీపీ శ్రేణులు కలిసి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రతులను తగలబెట్టారు.


ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంద న్నారు. అన్నివర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తాతా ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని ఓ ప్రణాళిక ప్రకారం కాజేసేందుకు ఈ చట్టం తెచ్చారని ఆరోపించారు. పాసుపుస్తకాలపైన, సర్వేరాళ్లపైన, రిజిస్ర్టేషన డాక్యుమెంట్లపైన జగన బొమ్మ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. ఏది ఏమైనా మీ భూములను జగన తాకట్టు పెట్టకుండా మీరే కాపాడుకోవా లని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేశవయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, పోతిరెడ్డి, రఘువీరచౌదరి, రామలింగ, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 12 , 2024 | 12:20 AM