VHP : దేవాలయాల పరిరక్షణ.. హిందువుల బాధ్యత
ABN , Publish Date - Sep 23 , 2024 | 11:51 PM
దేవాలయాలను పరిషరించడం హిందువుల బాధ్యత అని విశ్వహిందూపరిషత సభ్యులు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రలోని చౌడేశ్వరీ కళ్యాణమండపంలో సమావేశం నిర్వహించారు.
కదిరి(అమడగూరు),సెప్టెంబరు 23: దేవాలయాలను పరిషరించడం హిందువుల బాధ్యత అని విశ్వహిందూపరిషత సభ్యులు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రలోని చౌడేశ్వరీ కళ్యాణమండపంలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూతిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో జం తువుల కొవ్వును, చేప నూనెను వినియోగించడంతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్మప్రచార కర్త శ్రీనివా్‌సగుప్త, ప్రఖండ కార్యదర్శి గోరంట్ల రమేష్, ఓం ప్రకా్‌షస్వామి, మండల కన్వీనర్ సురేంద్రరెడ్డి, అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, సుబ్బిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆంజి పాల్గొన్నారు.
కొత్తచెరువు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ ధర్మపరిరక్షణ సమితి సభ్యులు తహసీల్దార్ నీలకంఠారెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. మొదట పురాతన వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేస్తూ నెహ్రూ కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. శేషాద్రినాయుడు, దివ్యతేజ, గాజుల నాగేంద్ర, అమరా చంద్రబాబునాయుడు, పీఎస్ వెంగప్ప, రవికుమార్, లోచర్లపెద్దన్న, టెలిపోన వెంకటేశ, శంకర్‌బాబు, శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, కేశవ పాల్గొన్నారు.