ycp: వైసీపీ అభ్యర్థి నామినేషనకు జనం కరువు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:55 AM
ధర్మవరం, ఏప్రిల్ 24:ధర్మవరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం నామినేషనదాఖలు చేశారు. అయితే నామినేషనకు అనుకున్న స్థాయిలో జనం రాలేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

- డబ్బులిచ్చినా ఆశించినస్థాయిలో రాని వైనం
ధర్మవరం, ఏప్రిల్ 24:ధర్మవరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం నామినేషనదాఖలు చేశారు. అయితే నామినేషనకు అనుకున్న స్థాయిలో జనం రాలేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
కేతిరెడ్డి తిక్కస్వామినగర్‌లోని శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 8-30గంటలకే ర్యాలీగా తరలివచ్చారు. అయితే జనం అనుకున్నంత మేర రాకపోవడంతో శ్రేణులపై తమ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 2019లో నామినేషనకు వచ్చిన అభిమానులతో బేరీజు చేసుకుంటే ఈ ఏడాది ఎన్నికల నామినేషనకు జనం రాక భారీగా తగ్గిపోయినట్టు ఆ పార్టీ వర్గాలే బాహాటంగా వ్యక్తం చేశారు. అభ్యర్థి నామినేషన వేయడానికి ఆర్డీఓకార్యాలయంలోకి వెళ్లగానే వచ్చిన కాస్తా జనం కూడా జారుకున్నారు. దీంతో ఖాళీ రోడ్డు దర్శనమిచ్చింది .ఒక్కొక్కరికి రూ.500 డబ్బులిచ్చి పిలిపించుకున్నా.. చివరి వరకు జనాలు ఎందుకు ఉండనివ్వలేదంటూ ఆ ప్రజాప్రతినిధి శ్రేణులపై ఆగ్రహం వ్యక్త చేసినట్లు సమాచారం.
మరిన్ని వార్తల కోసం...