Share News

YS Sharmila: మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:32 AM

‘ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్‌, గంజాయి మయం చేశాడు.

YS Sharmila: మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప

  • జగన్‌ హయాంలో రాష్ట్రం డ్రగ్స్‌ మయం: షర్మిల

పాడేరు, అనకాపల్లి, అరకులోయ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్‌, గంజాయి మయం చేశాడు. అభివృద్ధి, సంక్షేమం వదిలేసి రాష్ట్రాన్ని మద్యం అమ్మకాల్లో ముందుకు తీసుకువెళ్లారు’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు, అరకులోయ, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటల్లో శనివారం ఏపీ న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు.


చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేస్తానని భ్రమరావతి చేస్తే, జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులు అంటూ రాష్ట్ర ప్రజల చేతిలో చిప్పపెట్టి రాజధానే లేకుండా చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 23 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఐదేళ్లు కాలయాపన చేశారని విమర్శించారు.. రెండు నెలల ముందు 6,000పోస్టులతో దగా డీఎ్‌ససీ ఇచ్చారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా జగన్మోహన్‌రెడ్డి ఈ ఐదేళ్లు ఏమి చేస్తున్నారు..? గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా..? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మన బిడ్డలకు, రాష్ట్రానికి ఊపిరిలాంటిదని ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు. మన రాష్టానికి ఇప్పటికీ బీజేపీ వెన్నుపోటు పొడుస్తూనే ఉందన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 06:43 AM