Share News

Big Breaking: ఏపీలో ఏకంగా 96 మంది డీఎస్పీల బదిలీ

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Big Breaking: ఏపీలో ఏకంగా 96 మంది డీఎస్పీల బదిలీ
AP Police

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత ఐదేళ్లపాటు అరాచకానికి పాల్పడ్డ వైసీపీతో అంటకాగిన పలువురు డీఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారందరినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీ ఆదేశించారు.


కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనపై దృష్టిసారించింది. అందులో భాగంగా అధికారుల స్థానచలనంపై దృష్టిసారించింది. అన్ని శాఖల్లో బదిలీలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా పోలీసు శాఖలో ఏకంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది.


డీఎస్పీ చైతన్యకు నో పోస్టింగ్

కాగా గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ చైతన్యను బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన అధికారుల జాబితాలో ఆయన పేరుంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర రెడ్డి, ఆయన అనుచరులను డీఎస్పీ చైతన్య తీవ్రంగా వేధించిన విషయం తెలిసిందే. రాజంపేటకు బదిలీ అయినా సరే తాడిపత్రికి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారని చైతన్యపై అభియోగాలు ఉన్నాయి. రాజంపేటలో కూడా వైసీపీ కోసం డీఎస్పీ చైతన్య పని చేశారని, తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ బదిలీ అయ్యారు. పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్‌ను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు. ఈ రోజు రేపటిలో భారీగా డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేయనుంది. వైసీపీతో అంట కాగిన వారికి పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాడిపత్రిలో పని చేసి టీడీపీ నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన చైతన్యపై జేసీ అనుచరులు 23 ప్రైవేటు కేసులు వేశారు. చైతన్యపై శాఖాపరమైన విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 06:28 PM