2న కాకినాడలో జాబ్‌మేళా | job mela at kakinada vikasa office
Share News

2న కాకినాడలో జాబ్‌మేళా

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:36 PM

కాకినాడ సిటీ, ఆగస్టు 30: వికాస ఆధ్వర్యంలో సెప్టెంబరు 2న కాకినాడలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. క్యాపిటల్‌ ట్రస్ట్‌ లిమిటెడ్‌లో బీఎం బీక్యూఎం, ఆర్‌వో, ఐఆర్‌ఈపీ క్రెడిట్‌ కెపిటల్‌లో సేల్స్‌ ఆఫీసర్‌, ఇండో ఎంఐఎం, పానాసోనిక్‌ కంపెనీల్లో టెక్నీషియన్‌, రిఫ్యూటెడ్‌

2న కాకినాడలో జాబ్‌మేళా

కాకినాడ సిటీ, ఆగస్టు 30: వికాస ఆధ్వర్యంలో సెప్టెంబరు 2న కాకినాడలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. క్యాపిటల్‌ ట్రస్ట్‌ లిమిటెడ్‌లో బీఎం బీక్యూఎం, ఆర్‌వో, ఐఆర్‌ఈపీ క్రెడిట్‌ కెపిటల్‌లో సేల్స్‌ ఆఫీసర్‌, ఇండో ఎంఐఎం, పానాసోనిక్‌ కంపెనీల్లో టెక్నీషియన్‌, రిఫ్యూటెడ్‌ ఫార్మా కంపెనీలో టెక్నీషియన్‌, కెమిస్ట్‌, హెల్పర్‌ అండ్‌ ట్రైనీ ఇంజనీర్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్‌, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ, బీటెక్‌(బయోటెక్నాలజీ, మైక్రో బయోలజీ 2023, 2024 పాస్‌ అవుట్స్‌) ఉత్తీర్ణులైన 35ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. వారికి నెలకు రూ.12వేల నుంచి రూ.20వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాల ఆధారంగా ఉంటుందన్నారు. అభ్యర్థులు సోమవారం ఉదయం 9 గంటలకు కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్దకు సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో హాజరు కావాలన్నారు. వివరాలకు 77993 76111 నెంబరులో సంప్రదించాలని పీడీ తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Aug 30 , 2024 | 11:36 PM