చివరిలో వచ్చి.. సాధించారు!
ABN , Publish Date - Feb 03 , 2024 | 12:58 AM
రాజమహేంద్రవరం లోక్‌సభ వైసీపీ ఇన్‌చార్జిగా డా.గూడూరి శ్రీనివాస్‌ను అధిష్ఠానం నియ మించింది. ఇది మొదటి నుంచి నలుగుతున్న పేరే. వైద్యవృత్తిలో ఉన్న శ్రీనివాస్‌ను తొలుత సిటీ కోఆర్డినేటర్‌గా నియమించారు.

ఆది నుంచి ఉన్న వారికి మొండిచేయి
నాలుగన్నరేళ్లుగా ఉన్నా లెక్కచేయని వైనం
జగన్ మార్కు రాజకీయం
పద్మలత, చందన, విజయ్ వర్గాల్లో అసంతృప్తి
స్పష్టత లేని మరో మూడు నియోజకవర్గాలు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరం లోక్‌సభ వైసీపీ ఇన్‌చార్జిగా డా.గూడూరి శ్రీనివాస్‌ను అధిష్ఠానం నియ మించింది. ఇది మొదటి నుంచి నలుగుతున్న పేరే. వైద్యవృత్తిలో ఉన్న శ్రీనివాస్‌ను తొలుత సిటీ కోఆర్డినేటర్‌గా నియమించారు. సిటీ ఇన్‌చార్జిగా ఎంపీ మార్గాని భరత్‌ను నియమించడంతో ఆయన పరిస్థితి ఏంటని మొదట ఆయన ఆందోళన చెందారు.కానీ ఎంపీ సీటు బీసీ వర్గాలకే ఇస్తారనే స్పష్టత రావడంతో ఆయన పార్టీ పనిలోనే ఉన్నారు. ఆయనతో పాటు శెట్టిబలిజ వర్గం నుంచి డా.అనసూరి పద్మలత, పద్మశాలీవర్గం నుంచి చందన నాగేశ్వర్, యాదవ వర్గం నుంచి బర్ల విజయ టికెట్ ఆశిం చారు. వైసీపీ అధిష్ఠానం గూడూరి శ్రీనివాసనే అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో ఆయన వర్గంలో ఆనందం వ్యక్తమవుతోంది. రూరల్ కోఆర్డినేటర్‌గా పార్టీని కష్టకాలంలో కాపాడిన చందన నాగేశ్వర్‌కు మొదట రూరల్ సీటు ఇస్తామన్నారు.కానీ మంత్రి చెల్లుబోయిన వేణును రామచంద్రపురం నుంచి ఇక్కడకు బదిలీ చేయడంతో ఆయనను ఆకస్మికంగా మెడపట్టి తోసేసినట్టు అయింది. చివరకు ఎంపీ టికెట్ వస్తుందని కొద్దిరోజులు ఊరించారు.ఇవాళ అదీ పోయింది. దీంతో ఆయన వర్గం తీవ్ర అసం తృప్తితో ఉంది. ఇక డాక్టర్ పద్మలత 2014 నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అప్పట్లో ఆమె టీడీపీ టికెట్ ఆశించారు. కానీ బీజేపీతో పొత్తు వల్ల అప్ప ట్లో ఆమెకు అవకాశం దక్కలేదు.తర్వాత వైసీపీలో చేరి పనిచేశారు. ఆమెకే ఎంపీ టికెట్ ఖరా రైపోయినట్టు కొద్దిరోజుల కిందట విస్తృతంగా ప్రచారం జరిగింది.చివరకు వైసీపీ మొండిచెయి చూపడంతో పద్మలత వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరో అభ్యర్థి యాదవ వర్గం నుంచి బర్ల విజయ్ పేరును వైసీపీ అధిష్ఠానం పరిశీలించింది. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తనకు అవకాశం ఇస్తారని చెప్పినట్టు సోషల్ మీడి యాలో విజయ్ వర్గంప్రచారం చేసింది. ఇవాళ ఆయన వర్గం కూడా అసంతృప్తికి గురైంది. జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం ఉండగా, ఇప్పటికే నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానానికి అభ్యర్థులను వైసీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఇంకా అన పర్తి, రాజానగరం, నిడదవోలు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన వారే. ఎందువల్లనో వారి పేర్లను ఇంకా ప్రకటించకపోవడంతో, జగన్ ఎవరి కొంప ముంచుతారోననే భయం కూడా వారిలో మొదలైంది.