గోదావరి డెల్టాకు 7 వరకు నీటి విడుదల
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:25 AM
మోతుగూడెం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు నుంచి గోదావరి డెల్టా రబీ పంటలకు నీటి విడుదలను ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్టు ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు తెలిపారు. ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గోదావరి డెల్టా రబీ పంటలకు డొంకరాయి జ

ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు
మోతుగూడెం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు నుంచి గోదావరి డెల్టా రబీ పంటలకు నీటి విడుదలను ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్టు ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు తెలిపారు. ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గోదావరి డెల్టా రబీ పంటలకు డొంకరాయి జలాశయం స్పిల్‌వే ద్వారా విద్యుత్ ఉత్పత్తి లేకుండా నేరుగా 5వేల క్యూసెక్కులు, పొల్లూరు జల విద్యుత్ కేంద్రం నుంచి 4300 క్యూసెక్కు లు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. డొంకరాయి జలాశయం ద్వారా ఫిబ్రవరి 10 నుంచి మార్చి 31 వరకు ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదలచేయాలని తొలు త కోరారన్నారు. అయితే రబీ పంట లకు ఇంకా నీటి అవసరం ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 7 వరకు డొంకరాయి నుంచి 5వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 10 నుంచి మా ర్చి 31 వరకు డొంకరాయి జలాశయం స్పిల్‌వే గేట్ల ద్వారా 14.468టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం బలిమెల, జోలాపుట్‌లో ఆంధ్రా వాటా 33.1849 టీ ఎంసీలు, డొంకరాయి, గుంటవాడ (సీలేరు)జలశయాల్లో13.1061టీఎంసీలతో కలిసి మొత్తంగా సీలేరు కాంప్లెక్సుకు 46.2910 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు సీఐ వాసుదేవరావు తెలిపారు.