Share News

AP Elections: ఎన్నికల గొడవల తర్వాత ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై నిషేధం

ABN , Publish Date - May 18 , 2024 | 05:56 PM

ఆంధ్రప్రదేశ్‌‌‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు (AP Elections).. ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దాడులు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి..

AP Elections: ఎన్నికల గొడవల తర్వాత ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై నిషేధం

అమరావతి, ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు (AP Elections).. ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దాడులు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే జూన్-04న, ఆ తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అలర్ట్ చేయడంతో.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Petrol-Pumps-Bottles-Banned.jpg

సర్కారు వారి వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంక్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పెట్రోల్ బంక్‌లలో ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఖాళీ బాటిల్లలో పెట్రోల్ పడితే బంక్ యాజమానిపై క్రిమినల్ కేసులు పెడతామని ప్రభుత్వం హెచ్చరిచింది. ఎన్నికల అనంతరం అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. బంక్ యాజమాన్యం తప్పక జాగ్రత్తలు పాటించాలని అసోసియేషన్ కూడా పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆదేశాలను తప్పక పాటించాలని ఈ మేరకు పెట్రోల్ బంక్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పేరం రవి.. పెట్రోల్ బంక్ యాజమాన్యాలను కోరారు.

Updated Date - May 18 , 2024 | 05:57 PM