పది పరీక్షలపై అధికారుల దృష్టి
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:20 AM
జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని కేంద్రాల్లో కాపీయింగ్ జరుగుతున్నదన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి బుధవారం జిల్లాకు వచ్చారు.

జిల్లాలోని పలు కేంద్రాల తనిఖీ
ఒంగోలు విద్య, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని కేంద్రాల్లో కాపీయింగ్ జరుగుతున్నదన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి బుధవారం జిల్లాకు వచ్చారు. దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్, ముండ్లమూరు జడ్పీ హైస్కూల్‌లోని కేంద్రాలను సందర్శించారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకులు, విద్యాశాఖ అదనపు డైరెక్టర్ ఏవీ.సుబ్బారెడ్డి కనిగిరిలోని ఏడు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్‌కుమార్ సంతనూతలపాడులో రెండు, చీమకుర్తిలో ఒక కేంద్రాన్ని సందర్శించారు. సోమవారం చీమకుర్తిలోని ఒక పరీక్షా కేంద్రంలో విధి నిర్వహణలో నిద్రపోతున్నట్లు గుర్తించిన చీఫ్‌ను తొలగించారు. ఆయన స్థానంలో అక్కడి డిపార్ట్‌మెంట్ అధికారిని చీఫ్‌గా మార్చి కొత్తవారిని డీవోగా నియమించారు. బుధవారం జరిగిన ఫిజికల్ సైన్స్ పరీక్షకు 232 మంది విద్యా ర్థులు గైర్హాజరయ్యారు.