Share News

AP Election 2024: పవన్ ప్రయాణించాల్సిన హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:55 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Elections 2024) ప్రచారం హోరెత్తిపోతోంది. ఒక పక్క నామినేషన్లు.. మరోపక్క ప్రచారం మార్మోగుతోంది. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ప్రచార్వంలో దూసుకెళ్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సోమవారం ఊహించని అంతరాయం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలీకాప్టర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది.

AP Election 2024: పవన్ ప్రయాణించాల్సిన హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం

కాకినాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Elections 2024) ప్రచారం హోరెత్తిపోతోంది. ఒక పక్క నామినేషన్లు.. మరోపక్క ప్రచారపర్వం మార్మోగుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సోమవారం ఊహించని అంతరాయం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలీకాప్టర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. హెలీకాప్టర్ ఇంజన్ స్టార్ట్ అయినప్పటికీ పైకి ఎగరడంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను జనసేనాని రద్దు చేసుకున్నారు. తిరిగి చేబ్రోలులోని తన నివాసానికి వెళ్లిపోయారు.


మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు (మంగళవారం) పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. భారీ సంఖ్యలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

వైసీపీ అక్రమాలను అణిచేద్దాం... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

పోలీసులు కాంగ్రెస్ కోసం వర్క్ చేస్తున్నారా: మాధవీలత

Read Latest Andhra Pradesh news and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 06:21 PM