AP Politics: తేడా సుస్పష్టం.. ఇది కదా చంద్రబాబు పాలనకు నిదర్శనం..!
ABN , Publish Date - Apr 27 , 2024 | 07:15 PM
మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(Andhra Pradesh) భవితవ్యం నిర్దేశితం అవనుంది. మరో ఐదేళ్ల పాలన ఎవరి చేతిలో అనేది మే 13న డిసైడ్ కానుంది. దీనిని డిసైడ్ చేసేది రాష్ట్ర ఓటర్లే. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక్కసారి ఆలోచించండంటూ తెలుగుదేశం పార్టీ(TDP) కీలక ప్రకటన విడుదల చేసింది.
అమరావతి, ఏప్రిల్ 27: మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(Andhra Pradesh) భవితవ్యం నిర్దేశితం అవనుంది. మరో ఐదేళ్ల పాలన ఎవరి చేతిలో అనేది మే 13న డిసైడ్ కానుంది. దీనిని డిసైడ్ చేసేది రాష్ట్ర ఓటర్లే. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక్కసారి ఆలోచించండంటూ తెలుగుదేశం పార్టీ(TDP) కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రజా చార్జిషీట్ పేరుతో వైసీపీ(YCP) తప్పులను ఎండగట్టింది. ఎలాంటి పాలన కావాలో సమాలోచనలు చేయండంటూ ప్రజలకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.
ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాత ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తొలుత టీడీపీ ప్రభుత్వం.. ఆ తరువాత ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ సర్కార్ ఏర్పాటైంది. అయితే, గడిచిన పదేళ్ల కాలంలో తొలి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం.. ఆ తరువాత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ టీడీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఆ ఛార్జిషీట్‌లో చంద్రబాబు నాయకత్వంలోని పాలనకు, వైస్ జగన్ పాలనకు తేడాలను వివరిస్తూ అనేక అంశాలను ప్రస్తావించింది. మరి ఆ తేడాలేంటో ఓసారి చూద్దాం..
చంద్రబాబు పాలనకు.. జగన్ పాలనకు తేడాను కింద చూడొచ్చు..