Women Power: సెల్యూట్ తల్లీ.. ఎంతోమందికి ఆదర్శం ఈ యువతి..

ABN, Publish Date - Oct 24 , 2024 | 01:54 PM

తన ఆకలి సైతం మర్చిపోయి ఎంతోమంది ఆకలి తీరుస్తూ.. కుటుంబ పోషణే ధ్యేయంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఓ యువతి. ఎన్నో అవమానాలు భరిస్తూ సమయానికి ఎదుటివారి ఆకలి తీరుస్తూ డెలివరీ అవతారమెత్తింది ఆ యువతి. చేసే పని ఏదైనా.. అంకిత భావం, బాధ్యత ఉంటే చాలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఏలూరు, అక్టోబర్ 24: తన ఆకలి సైతం మర్చిపోయి ఎంతోమంది ఆకలి తీరుస్తూ.. కుటుంబ పోషణే ధ్యేయంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఓ యువతి. ఎన్నో అవమానాలు భరిస్తూ సమయానికి ఎదుటివారి ఆకలి తీరుస్తూ డెలివరీ అవతారమెత్తింది ఆ యువతి. చేసే పని ఏదైనా.. అంకిత భావం, బాధ్యత ఉంటే చాలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోంది. స్విగ్గీలో డెలివరీ బాయ్స్‌కు ధీటుగా డెలివరీ గర్ల్‌గా చేరి.. అనుకున్న సమయానికి ఫుడ్ డెలివరీ ఇస్తూ ఎంతో మంది ఆకలి తీరుస్తోంది. కష్ట పడి వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషిస్తూ నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కుటుంబ బాధ్యతలను మోస్తూ స్విగ్గీ సూపర్‌ గర్ల్‌గా గుర్తింపు పొందింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ యువతి.. తన చెల్లెళ్లకు పెద్ద దిక్కైంది. ఏలూరుకు చెందిన ఈ యువతికి సంబంధించి పూర్తి వివరాలను కింద వీడియోలో చూడొచ్చు..

Updated at - Oct 24 , 2024 | 01:54 PM