Share News

Amaravati Works: అమరావతి ప్రాంతంలో ఆ పనుల కోసం సీఆర్డీఏ ప్రణాళికలు..

ABN , Publish Date - Jul 02 , 2024 | 08:27 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో ఎన్డీయే ప్రభుత్వం(NDA Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి(Capital Amaravati) అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో జంగిల్, బుష్ క్లియరెన్స్‌ చేయాలంటూ సీఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Amaravati Works: అమరావతి ప్రాంతంలో ఆ పనుల కోసం సీఆర్డీఏ ప్రణాళికలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో ఎన్డీయే ప్రభుత్వం(NDA Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి(Capital Amaravati) అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి. అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో జంగిల్, బుష్ క్లియరెన్స్‌ చేయాలంటూ సీఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


పలు నిర్మాణాల వద్ద, నిర్మాణాలు చేపట్టాల్సిన ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, ముళ్ల కంపలను తొలగించాలంటూ సీఆర్డీఏను ఆదేశించింది. నెల రోజుల్లోగా పిచ్చిచెట్లు, ముళ్ల పొదలు తొలగించాలని ఆదేశాల్లో పేర్కొంది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల వద్ద కూడా శుభ్రం చేయాలంది. చంద్రబాబు సర్కార్ ఆదేశాలతో సీఆర్డీఏ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒకట్రొండు రోజుల్లో టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

Updated Date - Jul 02 , 2024 | 08:27 PM