Share News

TDP: కొలికపూడి శ్రీనివాస్‌ వ్యవహారం.. టీడీపీ హై కమాండ్ సీరియస్

ABN , Publish Date - Mar 28 , 2025 | 06:16 PM

Kolikapudi Srinivas: కొలికపూడి శ్రీనివాస్‌ వ్యవహారం‌పై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ దృష్టి సారించింది. అయితే ఇప్పటికే కొలికపూడి విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ మహిళపై కొలికపూడి దాడి చేశారంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

TDP: కొలికపూడి శ్రీనివాస్‌ వ్యవహారం.. టీడీపీ హై కమాండ్ సీరియస్
Kolikapudi Srinivas

అమరావతి: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో కొలికపూడి ఎపిసోడ్ చర్చనీయాంశంగా ఉంది. ఈ మేరకు కొలికపూడి నుంచి టీడీపీ హై కమాండ్ వేదిక కోరింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కో ఆర్డినేటర్, విజయవాడ ఎంపీ, మరో ముగ్గురిని కలిపి అధిష్ఠానం నివేదిక కోరింది. గత 10 నెలల నుంచి జరిగిన సంఘటనలపై నివేదికలో పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు రాత్రికి పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.


అయితే ఇప్పటికే తిరువూరు టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి శ్రీనివాసరావు అల్టిమేటం జారీచేసిన విషయం తెలిసిందే. రేపు ఉదయంతో 48 గంటల గడువు ముగియనుంది. ఇప్పటికే కొలికపూడి విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఓ మహిళపై కొలికపూడి దాడి చేశారంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కొలికపూడి ఇచ్చే వివరణను క్రమశిక్షణ కమిటీ బృందం టీడీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

Lokesh Congratulates Akhil: 11ఏళ్ల టెక్‌ పిడుగు అఖిల్‌కు మంత్రి లోకేష్ అభినందనలు

Vamsi Bail Petition: వరుస ఎదురుదెబ్బలతో వంశీ ఉక్కిరిబిక్కిరి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 06:25 PM