Share News

Deputy CM Pawan Kalyan: తీర ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jul 12 , 2024 | 06:35 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రకటించారు. తీర ప్రాంత నిర్వహణపై ఎన్సీసీసీఆర్ రూపొందించిన ప్రణాళికను విడుదల చేశారు.

Deputy CM Pawan Kalyan: తీర ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టి
AP Deputy CM Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రకటించారు. తీర ప్రాంత నిర్వహణపై ఎన్సీసీసీఆర్ రూపొందించిన ప్రణాళికను విడుదల చేశారు. తీర ప్రాంత నిర్వహణకు ఎన్సీసీసీఆర్, ఏపీసీజడ్ఎంఏల మధ్య అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి 973 కి.మీ.కిపైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం... తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

రాష్ట్రంలో సముద్రపు కోత ఆందోళన కలిగిస్తోంది, కోత ప్రమాదాన్ని నివారించేoదుకు ప్రత్యేక దృష్టిపెడుతున్నామని వివరించారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామని అన్నారు. రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చామని అన్నారు. తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికను డిప్యూటీ సీఎం విడుదల చేశారు.


నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్.సి.సి.ఆర్.) నిపుణులతో ప్రణాళిక రూపొందించామని వివరించారు. ఈ ప్రణాళిక తీర ప్రాంతంలో తీర ప్రాంతాల కోత, కెరటాల శక్తి తగ్గింపుతోపాటు కోత, కెరటాల తీవ్రత నుంచి వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకూ ఉపయోగపడుతుందని చెప్పారు. కొత్త ఓడ రేవులు, ఫిషింగ్ హార్బర్లు లాంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందన్నారు. ఎన్.సీసీఆర్., ఆంధ్ర ప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీలు మధ్య పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 06:35 PM