Nara Bhuvaneshwari: నితీష్ అద్భుత సెంచరీపై నారా భువనేశ్వరి ఏమన్నారంటే..
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:44 PM
Nara Bhuvaneshwari: క్రికెటర్ నితీష్‌కుమార్‌రెడ్డి అద్భుత సెంచరీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అభినందనలు తెలిపారు.నితీష్ తన కుటుంబాన్ని తెలుగు సమాజం గర్వించేలా చేశారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు.. నితీష్ అధిరోహించాలంటూ భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: క్రికెటర్ నితీష్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అభినందించారు. నితీష్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులతో పంచుకున్న ఆనంద క్షణాలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా గుర్తుచేసుకున్నారు. కుటుంబసభ్యులతో పంచుకున్న వీడియోను భువనేశ్వరి పోస్ట్ చేశారు. నితీష్ అద్భుత సెంచరీని చూసి తాము గర్విస్తున్నామని తెలిపారు. కుటుంబం గర్వపడేలా నితీష్ సంకల్ప విజయంతో వారి త్యాగాలకు ప్రతిఫలమిచ్చారని అన్నారు. నితీష్ తన కుటుంబాన్ని తెలుగు సమాజాన్ని గర్వించేలా చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు.. నితీష్ అధిరోహించాలంటూ నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు.
మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ ..
కాగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో అజేయ శతకం (105 బ్యాటింగ్) ద్వారా రికార్డ్ నెలకొల్పాడు. తద్వారా జట్టును ఫాలోఆన్ నుంచి కూడా గట్టెక్కించాడు. వాషింగ్టన్ సుందర్ (50)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో మూడో రోజు శనివారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358/9 స్కోరుతో నిలిచింది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ కొట్టడం ద్వారా రేర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నితీష్ రెడ్డి. టెస్టుల్లో అత్యంత పిన్న వయసుల్లో శతకం బాదిన వారిలో 3వ స్థానంలో నిలిచాడు. 21 ఏళ్ల 216 రోజుల వయసులో నితీష్ ఈ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ లిస్ట్‌లో మాజీ క్రికెటర్ అజయ్ రాత్రా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆయన 20 ఏళ్ల 150 రోజుల వయసులో భారత్ తరఫున లాంగ్ ఫార్మాట్‌లో సెంచరీ కొట్టాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ అబుల్ హసన్ (20 ఏళ్ల 108 రోజుల వయసు) ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. నితీష్ మూడో స్థానంలో నిలిచాడు. దీంతో మరో రికార్డును కూడా నితీష్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్
Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం
JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్
Read Latest AP News and Telugu News