Share News

Satya Kumar: ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్‌దే..

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:57 PM

రుయా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు.

Satya Kumar: ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్‌దే..

తిరుపతి: రుయా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రక్షాళన దిశగా ముందుకెళుతున్నామని సత్యకుమార్ తెలిపారు.


రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని సత్యకుమార్ అన్నారు. రుయా ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్లు పాతవేనన్నారు. ఓపి కోసం గంటల తరబడి రోగులు వేచి చూడాల్సి వస్తోందన్నారు. రిషికొండలో జగన్ ఇచ్చిన హంగూ, ఆర్భాటం చూసి ఆశ్చర్యమేసిందని తెలిపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నాడు.

Updated Date - Jun 17 , 2024 | 01:57 PM