Sand booking ఇసుక బుకింగ్ మరింత సులభతరం
ABN , Publish Date - Sep 19 , 2024 | 11:39 PM
నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుక సులభంగా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాండిల్ బుకింగ్ పోర్టల్‌ను అమలులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి(కలెక్టరేట్) సెప్టంబరు 19: నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుక సులభంగా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాండిల్ బుకింగ్ పోర్టల్‌ను అమలులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి నూతన ఇసుక పాలసీ ప్రకారం ఉచితంగా ఇసుకను పొందేందుకు రాష్ట్ర గనులశాఖ, భూగర్భశాఖ వారు రూపొందించిన ఏపీ శాండిల్ పోర్టల్‌ను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా నుంచి కలెక్టర్, డీఅర్‌ఓ హాజరయ్యారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు ఉచిత ఇసుక ఇవ్వడమే కాకుండా, వారు కోరుకుంటే అ ఇసుకను ఇంటికి చేర్చేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఇందుకోసం కేవలం రవాణా చార్జీలు చెల్లించాల్సి వుంటుందన్నారు. గనులశాఖ అధికారి రవిప్రసాద్, అర్‌టీఓ భరత చౌహన, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.