AP Govt: ఒకే కాంట్రాక్టర్‌కు రూ.64 కోట్ల చెల్లింపులు... ఆర్థిక శాఖలో బయటపడుతున్న వాస్తవాలు
ABN , Publish Date - Aug 30 , 2024 | 09:51 AM
Andhrapradesh: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు అన్నీ బయటపడుతున్నాయి. అన్ని శాఖలో వైసీపీ పెద్దలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటికీ వెలుగులోకి వస్తుండటం తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా ఆర్థిక శాఖలో బిల్లులు చెల్లింపు వ్యవహారాలు బయటకు వస్తున్నాయి.
అమరావతి, ఆగస్టు 30: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు అన్నీ బయటపడుతున్నాయి. అన్ని శాఖలో వైసీపీ (YSRCP)పెద్దలు, అప్పటి అధికారులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటికీ వెలుగులోకి వస్తుండటం తీవ్ర సంచలనంగా మారింది. తాజాగా ఆర్థిక శాఖలో బిల్లులు చెల్లింపు వ్యవహారాలు బయటకు వస్తున్నాయి.
YS Jagan: కీలక సమయంలో విదేశాలకు వైఎస్ జగన్.. వ్యూహమేంటో..?
గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలకంగా వ్యవహరించి రిటైర్ అయిన అధికారి బంధువుకు ఒకే రోజు రూ.64 కోట్లు చెల్లింపులు చేసినట్లు రికార్డుల్లో ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ కాంట్రాక్టర్‌కు ఒకేరోజు రూ.64 కోట్లను అధికారులు చెల్లించిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న బయటకు వచ్చిన పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు తరువాత బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లో వచ్చిన కథనాలు అనంతరం తాజాగా నెల్లూరు బిల్లులు చెల్లింపులు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Viral News: హైదరాబాద్‌లో తొలి కొరియర్ డెలివరీ మహిళ.. నెలకు రూ.30 వేల సంపాదన
ఆ హెడ్ కింద మొత్తం మంజూరు అయిన రూ.100 కోట్లలో రూ.64 కోట్లు నెల్లూరు కాంట్రాక్టర్‌కు అధికారులు ఇచ్చినట్లు బయటపడింది. ఐఐబీగ్రాంట్ కింద రూ.100 కోట్లు వస్తే రూ.64 కోట్లు నెల్లూరుకు చెందిన వైసీపీ కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిగాయి. ఈ వ్యవహారంపై మిగిలిన కాంట్రాక్టర్లు రగులుతున్న పరిస్థితి. ఈ వ్యవహారన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేయాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. తమ బిల్లులు చెల్లించకుండా వైసీపీ కాంట్రాక్టర్లుకు చెల్లించడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral: కారులో డాష్‌క్యామ్ పెట్టుకోండి.. ఇలాంటి మహిళ ఎదురైతే యమా డేంజర్
Cyber Crime: మచిలీపట్నంలో మరో ఆన్‌లైన్ మోసం..
Read Latest AP News And Telugu News